)
OG Craze In Peaks first ticket sold whopping prise: పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పలకరించారు. ఈ మూవీ కంటెంట్ బాగున్నా.. సరైన విధంగా తెరకెక్కించక పోవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరిగా నడవలేదు. అయినా.. ఈయన హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఓజీ’ మూవీపై ఏ మాత్రం అంచనాలు తగ్గడం లేదు. ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ తో పాటు గ్లింప్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఈ నెల 25న విజయ దశమి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.
పవన్ బర్త్ డే సందర్భంగా వింటేజ్ లుక్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న పోస్టర్ అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఈ పోస్టర్ సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ను ఈ టైప్ ఆఫ్ లుక్ లో చూసి చాలా కాలం అయిందని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. పంజా తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. 'ఓజీ' అనే టైటిల్ కి తగ్గట్టుగానే పోస్టర్ కూడా ఎంతో శక్తివంతంగా ఉంది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఊపు నిచ్చేలా “HBD OG - LOVE OMI” అనే గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొదటి నుండి 'ఓజీ'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ను డిఫరెంట్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. అంతేకాదు తనదైన మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ లో ఇమ్రాన్ హష్మీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టే బలమైన పాత్రలో ఆయన కనిపించనున్నారు.
ఈ చిత్రంలో ఓజాస్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో 'ఓజీ' ముందు వరుసలో ఉంటుందనేది ఎలాంటి డౌట్ లేదు. సెప్టెంబర్ 25, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నైజాం టికెట్ ను అమెరికాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఆన్ లైన్ లో వేలం వేయగా నార్త్ అమెరికాలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ టికెట్ ను రూ. 5 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ప్యాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని చెబుతున్నారు ఆయన అభిమానులు. ఇక నైజాంలో ఈ సినిమా రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫైనల్ లెక్కలు త్వరలో తేలనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.