OG: పవన్ కళ్యాణ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్.. ఓజీ పై బిగ్ అప్ డేట్..

OG Movie Update: పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక అడుగు ముందుకేస్తే.. ఆరడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు నుంచి నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘ఓజీ’ సినిమా ఒకటి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఈ సినిమా మేకర్స్ అందించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 13, 2025, 06:15 AM IST
OG: పవన్ కళ్యాణ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్.. ఓజీ పై బిగ్ అప్ డేట్..

OG Movie Update: పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫుల్ బిజీ అయ్యారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పవన్ కళ్యాన్ తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఈయన హీరోగా ‘హరిహర వీరమల్లు’  సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. తాజాగా ‘హరి హర వీరమల్లు’ సినిమా ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పూర్తైయింది. దీంతో త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.

Add Zee News as a Preferred Source

మరోవైపు హరి హర వీరమల్లు రెండో పార్ట్ కూడా త్వరలో పూర్తి చేయనున్నారు. ఆ సినిమా కాకుండా సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి చేశారు. మరో 30 రోజులు డేట్స్ ఇస్తే ఈ మూవీ షూటింగ్ పూర్తవుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. మరో వారంలో ఈ సినిమా షూటింగ్ లో పవన్ జాయిన్ కానున్నారు. హీరో, విలన్ మధ్య సన్నివేశాలతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.

ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను పూర్తి చేయనున్నారు. మొత్తంగా  పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే నెలలో 10 నుంచి 15 రోజులు పాటు సినిమా షూటింగ్ లకు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు..సగంలో ఉన్న సినిమాలు పూర్తి చేసి పూర్తిగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించబోతున్నట్టు సమాచారం. 

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News