)
OG Public Response
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింతే చాలు .. అభిమానుల్లో పవర్ దానంతట అదే వస్తుంది. వచ్చింది చిరంజీవి తమ్ముడు గానే ఆయన.. పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఆయనకు విజయాలు అంత సులువుగా మాత్రం రాలేదు.. అంతేకాదు రావడం లేదు కూడా..
OG Public Talk
పవన్ కళ్యాణ్ ఈమధ్య ఓజి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఏది నాకు సులువుగా రాదు అని చెప్పుకొచ్చారు. ఆ మాట నిజంగా నిజమే అని పవన్ కళ్యాణ్ జీవితం చూసిన వాళ్ళు చెప్పక మానరు. పాలిటిక్స్ లో ఆయన ఎన్ని కష్టాలు పడి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి వచ్చారు అనేది మన అందరికీ తెలిసిన విషయమే.
మరోపక్క సినిమాల్లో పవన్ కళ్యాణ్ అంటే సపరేట్ క్రేజ్ ఉంది. అయినా కానీ ఆయనకు విజయాలు మాత్రం అంత సులభంగా రాలేదు. మొదట్లో అన్ని సినిమాలు పరవాలేదు అనిపించుకుంటూ రాగా.. తమ్ముడు, తొలిప్రేమ, బద్రి చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి.
ఇక ఆ తరువాత ఖుషి సినిమాతో.. మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగింది. ఆ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మారిపోయారు. 2001లో విడుదలైన ఈ చిత్రం.. అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టింది.
కానీ ఆ తరువాత పవన్ కి అసలు గట్టి పరిస్థితి ఏర్పడింది. వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ గా నిలిచింది. జల్సా సినిమా ఒక్కటే పర్వాలేదు అనిపించుకుంది. అలా దాదాపు పది నుంచి 12 ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఫైనల్ గా 2013లో.. మరోసారి.. అత్తారింటికి దారేది చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా కూడా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది…ఖుషి తర్వాత ఆ రేంజ్ లో ఆడిన పవన్ కళ్యాణ్ చిత్రం ఇదే అని చెప్పాలి…
ఇక మళ్లీ షరా మామూలే.. ఖుషి తర్వాత లాగానే అత్తారింటికి దారేది తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ని వరుస అపజయాలు.. చుట్టుముట్టడం మొదలైంది. మధ్యలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి చిత్రాలు కేవలం యావరేజ్ గా మిగిలాయి. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ 12 సంవత్సరాల తరువాత.. They Call Him OG వచ్చింది. ఈ చిత్రం అభిమానులకు ఫుల్ మీల్స్ పెడుతుంది అంటూ నిన్న ప్రీమియర్స్ దగ్గర నుంచే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఈ క్రమంలో ఇది యాదృచ్చికమా, నమ్మకమా తెలీదు కానీ.. ప్రతి 12 సంవత్సరాలకు పవన్ కళ్యాణ్ రికార్డులు తిరిగి రాయడం మాత్రం జరుగుతూనే ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook