Sai pallavi again controversy old video viral: అనంతనాగ్ జిల్లా పహల్గంలో ఉగ్రవాదులు ఆర్మీ దుస్తులో వచ్చి టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. అంతేకాకుండా.. అమాయకులైన టూరిస్టులను ఐడీకార్డులు చెక్ చేసి మరీ హిందువులను కాల్చించంపారు.ఈ క్రమంలో ఇది పక్కా.. హిందువులపై దాడి ఘటన అంటూ నెట్టింట దుమారం చెలరేగింది. ఈ ఘటనపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకొవాలని దేశ వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రదాడి ఘటనను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉగ్రదాడిపై గతంలో సాయిపల్లవి ఇండియన్ ఆర్మీ , పాక్ ఆర్మీ ఒకటే అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై ప్రస్తుతం దుమారం చెలరేగింది. పాక్ వాళ్లు మనల్ని శత్రువుల్లా చూస్తారు.. మనం పాక్ వాళ్లను శత్రువులుగా చూస్తాం.. అదే విధంగా.. జరుగుతుందని సాయిపల్లవి అన్నారు. ఈ క్రమంలో.. ప్రస్తుతం ఈ దాడి వెనుక ఉగ్రకుట్ర ఉందని స్పష్టంగా అర్థమౌతుంది. మనల్నిపాక్ ఆర్మీని ఒకేలా పోల్చడమేంటనీ నెటిజన్లుఈ కింది ప్రశ్నలు సంధిస్తున్నారు.
National crush, my foot!#PahalgamTerroristAttack #पहलगाम #Pahalgampic.twitter.com/I4LKXnyK1Z
— Kreately.in (@KreatelyMedia) April 23, 2025
అంతేకాకుండా.. పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఇటీవల చేసిన కామెంట్స్ దుమారంగా మారిన విషయం తెలిసిందే. జమ్ము కాశ్మీర్ సోదరులను మేం మర్చిపోలేమని అన్నారు. అదే విధంగా జమ్ము ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. జమ్ములో హిందువులు, ముస్లింలను ఒకరకంగా కాకుండా భిన్నంగా చూస్తున్నారని రెండు వర్గాల మధ్య వివాదం రాజేశారు.
అయితే.. మొత్తంగా జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేసి ప్రభుత్వం ఏర్పడి ప్రశాంతంగా ఉన్న సమయంలో మరోసారి గొడవలకు కారణమయ్యారు. దీన్ని బట్టి చూస్తే.. పాక్ లో.. అసలు ఒకవైపు ఆదేశంలో ఆర్థిక పరిస్థితి మరీ దిగజారీ ఉంది. కనీసం తమ దేశంలో ప్రజలకు సరిపడా అవసరాలు తీర్చుకోలేకపోతుంది. ఈ క్రమంలో పక్కాదేశానికి పక్కలో బళ్లెంగా మారి గొడవలకు కారణమైంది. అంతే కాకుండా.. ఇన్ డైరెక్ట్ గా అక్కడ అశాంతిని రగిల్చింది.
మొత్తంగా ప్రస్తుతం ఈ ఘటనపై దేశంలో ఈ ఘటనకు ఇండియన్ ఆర్మీని దెబ్బకొట్టేందుకు.. పాక్ వెనుకుండి నడ్పించిదా అన్న అనుమానాలు రెకెత్తితున్నారు. అసలు.. మనదేశపు.. ఆర్మీ వాళ్లు దాయాది దేశాలు ఎంత రెచ్చిగొట్టిన కూడా సంయమనంతో ఉంటాయి. అంతే కాకుండా.. ఇప్పటికే ఒకవైపు చైనా, పాక్ లు ప్రతిసారి కయ్యానికి కాలు దువ్వుతుంటాయి. నియంత్రణ రేఖను దాటి వస్తుంటాయి.
ఈ క్రమంలో గతంలో సాయి పల్లవి.. ఇండియన్ ఆర్మీ, పాక్ ఆర్మీ ఒక్కటే అని ఎలా అనిందని.. వాళ్లకు మనకు నక్కకు.. నాగలోకానికి మధ్యన తేడాలు ఉన్నాయని కూడా నెటిజన్లు మరోసారి సాయిపల్లవిపై మండిపడుతున్నారు. దీనిపైన వెంటనే సర్జీకల్ స్ట్రైక్స్ చేయాలని, పాక్ ముష్కరులకు తగిన బుద్ది చెప్పాలని కూడా భారతీయులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









