Renu desai on Marriage: రెండో పెళ్లి అప్పుడు చేసుకుంటా..!.. మనసులో మాటబైటపెట్టిన రేణుదేశాయ్.. మ్యాటర్ ఏంటంటే..?

Pawan kalyan ex wife renu desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండో పెళ్లిపై, ఫ్యూచర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం పిల్లల్ని చూసుకొవడంలో బిజీగా ఉన్నారన్నారు. కానీ ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటానని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 10, 2025, 02:06 PM IST
  • రెండో పెళ్లిపై నోరు విప్పిన రేణు దేశాయ్..
  • నెట్టింట వైరల్గా మారిన కామెంట్స్..
Renu desai on Marriage: రెండో పెళ్లి అప్పుడు చేసుకుంటా..!.. మనసులో మాటబైటపెట్టిన రేణుదేశాయ్.. మ్యాటర్ ఏంటంటే..?

Renu desai latest comments on her second wedding: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల తెగ వార్తలలో ఉంటున్నారు. ఇటీవల రాజకీయాల్లోకి రావడంపై కామెంట్లు చేసిన రేణుదేశాయ్.. మరల తన రెండో పెళ్లి, ఫ్యూచర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. రేణు దేశాయ్ ఇటీవల మాట్లాడుతూ.. ప్రస్తుతం తన పిల్లలు ఆద్య, అకీరాలను చూసుకొవడంలో బిజీగా ఉన్నానన్నారు. అంతే కాకుండా.. ఫ్యూచర్ లో.. తాను రెండో పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చారు.

Add Zee News as a Preferred Source

తనకు కూడా ఒక తోడు కావాలని ఉంటుందన్నారు . గతంలో ఒకసారి పవన్ తో విడాకుల తర్వాత ఎంగెజ్ మెంట్ అయ్యిందని గుర్తు చేశారు. కానీ ఒకవైపు పిల్లలు, మరోక వైపు రిలేషన్ కు న్యాయం చేయలేననిపించి.. అప్పుడు డ్రాప్ అయ్యానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆద్యకు 15 ఏళ్లు.. తనకు 18 ఏళ్లు వచ్చాక.. తాను పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పింది.

మరోవైపు అకీరా నందన్ కూడా కూడా వెండితెరపై చూడాలని ఉందని చెప్పుకొచ్చింది. అదే విధంగా అకీరా.. ఓజీలో కన్పిస్తున్నారనే వార్తలలో నిజంలేదని కొట్టిపారేశారు. అదే విధంగా గతంలో పిల్లలు చిన్నగా ఉండటంవల్ల రాజకీయాల్లోకి చేరే అవకాశం వచ్చిన కూడా.. వెళ్లలేదని అన్నారు. ఒకవేళ భవిష్యత్తులు ఏదైన అవకాశం వస్తే.. తప్పకుండా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారనని కామెంట్లు చేశారు.  ప్రజలకు సేవ చేయడం తనకు ఎంతో ఇష్టమన్నారు.

Read more: Tamannaah Video: ఓదెలా ప్రమోషన్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రియుడి గురించి క్వశ్చన్..!.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన తమన్నా.. వీడియో ఇదే..

ఇదిలా ఉండగా.. న‌టిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కురాలిగా రేణుదేశాయ్ తన దైన సత్తాచాటారు. ఇటీవల.. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ కాక‌పోవ‌డంతో సైలెంట్ అయింది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు బర్నింగ్ ఇష్యూస్ పైన తనదైన స్టైల్ లో పోస్టులు పెడుతు రేణు దేశాయ్ మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంటారు. ప్రస్తుతం రేణుదేశాయ్ పొలిటికల్ ఎంట్రీ, రెండో పెళ్లిపై కామెంట్స్ నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News