Renu Desai: డిప్యూటీ సీఎం మాజీ భార్య సంచలన ప్రకటన.. 'నేను చచ్చిపోతా.. నా బిడ్డలను కాపాడండి'

Pawan Kalyan Ex Wife Renu Desai Joins Save HCU Movement: ఉప ముఖ్యమంత్రి మాజీ భార్య తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై సంచలన వీడియో విడుదల చేశారు. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఆ వీడియోలో కీలక విజ్ఞప్తులు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 2, 2025, 12:26 AM IST
Renu Desai: డిప్యూటీ సీఎం మాజీ భార్య సంచలన ప్రకటన.. 'నేను చచ్చిపోతా.. నా బిడ్డలను కాపాడండి'

Renu Desai Save HCU: దేశవాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న హెచ్‌సీయూ భూముల పరిరక్షణ ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వస్తుండగా.. వివిధ రంగాల ప్రముఖులు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు హెచ్‌సీయూ ఉద్యమానికి మద్దతు ప్రకటించగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ కూడా జత కట్టారు. హెచ్‌సీయూ విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పలుకుతూనే రేవంత్‌ రెడ్డికి సంచలన వీడియో విడుదల చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: HCU 400 Acres: ఢిల్లీకి చేరిన హెచ్‌సీయూ భూముల వివాదం.. కాపాడాలని కేంద్ర మంత్రికి ఫిర్యాదు

హెచ్‌సీయూ 400 ఎకరాల పరిరక్షణ ఉద్యమానికి మొదటి నుంచి మద్దతు ప్రకటిస్తున్న నటి రేణు దేశాయ్‌ తాజాగా ఓ వీడియో రూపొందించారు. నేరుగా రేవంత్‌ రెడ్డికి కొన్ని విషయాలు చెబుతూనే కీలకమైన విజ్ఞప్తి చేశారు. 'నా హృదయపూర్వక విజ్ఞప్తి. రెండు రోజుల కిందట హెచ్‌సీయూ భూముల విషయం తెలిసింది. ఆ విషయం గురించి మరికొన్ని వివరాలు తెలుసుకున్నా. నేను ఒక తల్లిగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎలాగో పోతాను. నా వయసు 44. మా పిల్లల కోసం.. మన పిల్లల కోసం విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఒక్క 400 ఎకరాలను వదిలేయండి' అని రేణు దేశాయ్‌ విజ్ఞప్తి చేశారు.

Also Read: Save HCU Movement: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. 'మమ్మల్ని అభినందించాలి'

ఏదో ఒకటి ప్రయత్నించి వీటిని కాపాడాలని నటి రేణు దేశాయ్‌ కోరారు. 'మనకు నీళ్లు కావాలి. ఆక్సిజన్‌ కావాలి. మనకు అభివృద్ధి కావాలి.. ఫ్లైఓవర్లు, ఐటీ పార్క్‌లు కావాలి. కానీ ఈ భూములను మాత్రం వదిలేయండి' అని వీడియోలో చెప్పారు 'ఒక తల్లిగా.. ఒక పౌరురాలిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనం నగరాలు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి ఉంది కాబట్టే మనం నగరాల్లో ఉన్నాం. ఆ 400 ఎకరాలు కాకుండా ఆలోచన చేయండి. మనకు చెట్లు కావాలి. మనకు జీవ వైవిధ్యం కావాలి. అధికారులు, మంత్రులు దీనిపై పునరాలోచించాలి. ఒకవేళ పునరాలోచన చేస్తే అది సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది' అని రేణు దేశాయ్‌ విజ్ఞప్తి చేశారు.

కాగా హెచ్‌సీయూ భూముల పరిరక్షణపై వరుసగా సినీ ప్రముఖులు ట్వీట్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌, రీల్స్‌, పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్‌ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌, దర్శకుడు వేణు ఉడుముల, ప్రియదర్శి, ఈషా రెబ్బా తదితర నటీనటులు హెచ్‌సీయూకు మద్దతు ప్రకటిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సినీ తారలు హెచ్‌సీయూ అంశంపై స్పందించే అవకాశం ఉంది.

 
 
 
 
 
 
 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News