Hari Hara Veera Mallu Releases Date Special:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ గత కొన్ని సంవత్సరాలుగా వాయిదాల బారిన పడుతూ వచ్చింది. మొదట క్రిష్ జాగర్లమూడి.. దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రం, ఆ తర్వాత జ్యోతి కృష్ణ పర్యవేక్షణలో షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. కానీ విడుదల తేదీ మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మూడుసార్లు విడుదల తేదీ ప్రకటించబడినా, వీఎఫ్ఎక్స్, బిజినెస్ డీల్స్ వలన ఆలస్యం జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా సినిమా యూనిట్ మరో కొత్త విడుదల తేదీ ఖరారు చేశారు. ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇదే రోజున పవన్ కళ్యాణ్ కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘తొలిప్రేమ’ కూడా విడుదలైంది. అందువల్ల, అభిమానులు ఈ సెంటిమెంట్ ఈ సారి కూడా పనిచేస్తుందని ఆశిస్తున్నారు.
One fights for Power.
One fights for Dharma.
The clash of legacies begins. 🔥Witness the Battle for truth, faith and freedom 𝐈𝐧 𝐂𝐢𝐧𝐞𝐦𝐚𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒, 𝟐𝟎𝟐𝟓 ⚔️🔥
A Historic Experience Awaits ❤️#HariHaraVeeraMallu 🏹#HHVMonJuly24th #HHVM… pic.twitter.com/WHLUZWtavA
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 21, 2025
ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను "సరే ప్రారంభిద్దాం" అనే కామెంట్‌తో చిత్రబృందం ట్వీట్ చేయడం, శనివారం ఉదయం 7:23కి కొత్త అప్డేట్‌ను వెల్లడించనున్నట్లు ప్రకటించడం, రిలీజ్ డేట్‌పై స్పష్టత ఇస్తారు అనే సూచనలు ఇచ్చాయి. ఇక అదే ఫాలో అవుతూ ఈరోజు ఉదయం మరో కొత్త పోస్టర్తో విడుదల తేదీని ఖరారు చేశారు.
ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ, థియేట్రికల్ డీల్స్ ఇంకా క్లియర్ కాకపోయినా, చిత్ర యూనిట్ కచ్చితంగా ఈ సారి విడుదలపై నిశ్చయించుకుంది అని వినికిడి. అభిమానులు కూడా ఈసారి సినిమాను థియేటర్లలో చూడబోతున్నామనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.
జూలై 24 న విడుదలవుతున్న హరి హర వీరమల్లు… ఈసారి నిజంగానే పవన్ మేనియా మళ్ళీ మెరుస్తుందేమో చూడాలి!
Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..
Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!
You May Like
దీన్ని ఒక్కసారి తినండి మీ పురుష బలం 10 రెట్లు పెరుగుతుంది.TANTRA MAX
బరువు తగ్గడానికి సులభమైన మార్గం - రాత్రికి కేవలం ఒక చెంచా!ONE TWO SLIM
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook