)
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా ఏ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మాతగా మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రాన్ని క్రిష్, జ్యోతికృష్ణ ద్వయం డైరెక్ట్ చేశారు. ఇక ‘హరి హర వీరమల్లు’ టైటిల్ విషయానికొస్తే.. శివుడు, విష్ణువుల అవతారం ఈ 'వీరమల్లు' అని మేకర్స్ తెలియజేసారు. పవన్ కళ్యాణ్ నూతన చిత్రం 'హరి హర వీరమల్లు' తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా తెరకెక్కించినట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు మేకర్స్. ఈ చిత్రం రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదని క్లారిటీ ఇచ్చారు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన జానపద సినిమాగా చెప్పొచ్చు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది తెరకెక్కించినట్టు మేకర్స్ తెలిపారు.
క్రిష్, తర్వాత జ్యోతి కృష్ణ డైరెక్షన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 'హరి హర వీరమల్లు' కథ పూర్తిగా మారిపోయింది. దర్శకుడు కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ.. సరికొత్త స్టోరీగా దీనిని మలిచారు.మన పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా, శైవం, వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో.. అలాగే 'హరి హర వీరమల్లు'ను శివుడు, విష్ణువుల అవతారంగా చూడబోతున్నామన్నారు.
ఇందులో హరి(విష్ణు) హర(శివుడు) అనే టైటిల్ ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుందన్నారు. శివుడు, విష్ణువుల అవతారం 'వీరమల్లు' అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను చేర్చారు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. అలాగే, హీరో తన చేతుల్లో శివుడిని సూచించే డమరుకం పట్టుకున్నాడు. ఈ చిత్రంలో హీరో ధర్మాన్ని రక్షణ కసం పోరాడే శివుడు, విష్ణువుల రూపంగా హరి హర వీరమల్లు సినిమాను తెరకెక్కించారు.
'హరి హర వీరమల్లు' చిత్రాన్ని ఎ.ఎం. రత్నం అత్యధిక బడ్జెట్ తో భారీస్థాయిలో నిర్మించారు. భారీ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన ఎ.ఎం. రత్నం.. గతంలో కూడా ఇలా అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలతో భారీ సక్సెస్ లను నమోదు చేసింది. ఈ చిత్రాన్ని తెలంగాణలో దాదాపు రూ. 50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. మేకర్స్ రూ. 65 కోట్లకు కోట్ చేసినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 130 కోట్ల వరకు చేసినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్స్ రూపేణా దాదాపు రూ. 100 కోట్ల వరకు పలికినట్టు సమాచారం. ఇక ఓవర్సీస్, హిందీ తప్ప సినిమాకి సంబంధించిన మిగతా హక్కులను అమ్మడానికి ఎ.ఎం. రత్నం ఇంకా రెడీ అవ్వలేదు.
అసలే పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. హిందీలో కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ చేసింది. దాదాపు హిందీలో రూ. 30 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో 'హరి హర వీరమల్లు'పై అంచనాలు భారీగా ఉన్నాయి.‘హరి హర వీరమల్లు’ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీస్థాయిలో నిర్మించారు. ప్రేక్షకులు కూడా వెండితెరపై ఈ చిత్రాన్ని చూసి అనుభూతి పొందటం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొత్తంగా జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కాబోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.