)
Pawan Kalyan Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో, రాజకీయాలతోనే కాకుండా తరచూ తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎంతోమంది తమ పబ్లిసిటీ కోసం కూడా పవన్ కళ్యాణ్ పేరు ఉపయోగించుకుంటూ ఉంటాడు.
ఈ క్రమంలో ఈ హీరో గురించి..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. రేణు దేశాయ్‌ని.. పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇది నిజమైన ప్రేమ కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
గీతా కృష్ణ వ్యాఖ్యల ప్రకారం, బద్రి సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ బద్రి సినిమా షూటింగ్ అప్పుడు హీరోయిన్ ఆమీషా పటేల్ ని ప్రేమించారని.. అయితే ఆమె సినిమాలు మానేస్తేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో.. ఆమీషా ఆ కండిషన్ కి నిరాకరించింది అని తెలిపారు.
Pawan Kalyan Ameesha Patel Love Story : ఇక ఆ తర్వాత మరిన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేస్తూ.. అనుషా పటేల్‌తో విఫలమైన ప్రేమ కారణంగా..ఆ కోపంతోనే రేణు దేశాయ్‌ని పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారని ఆయన తెలిపారు. కాగా..బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు అమీషా పటేల్ రేణు దేశాయ్ ఇద్దరు నటించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్ ప్రేమలో ఉన్నారు అని డేటింగ్ చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
అసలు పవన్ కళ్యాణ్ అమీషా పటేల్ ప్రేమలో ఉన్నారు అన్న విషయం కనీసం.. అప్పట్లో రూమర్ కూడా వినిపించలేదు. ఇక ఇప్పుడు దర్శకుడు ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయటంతో.. పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. పాపులారిటీ కోసం వేరే వారి వ్యక్తిగత జీవితాల గురించి ఇలాంటి తప్పుడు మాటలు చెప్పడం.. తగదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు..తీసుకున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన మూడో తారీకు అన్నా లెజినోవాతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఇటు రాజకీయాల్లో, అటు సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe