)
OG Movie Cancel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల బెంగళూరును బెంబేలెత్తించారు. ‘ఓజీ’ సినిమా చూసేందుకు వచ్చిన పవన్ అభిమానులు బెంగళూరు కేఆర్ పురంలో బీభత్సం సృష్టించారు. సినిమా ప్రదర్శన సమయంలో స్క్రీన్ వైపు దూసుకొచ్చిన ఫ్యాన్స్ కత్తితో విన్యాసాలు చేసి బెదిరించారు. సినిమాలో ఫైట్ సన్నివేశాల్లో కత్తితో పోటువేసినట్లు సినిమా థియేటర్ లోని స్క్రీన్ పై కత్తిపోటుతో చించేశారు. నానా హంగామా చేయడంతో థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శననను నిలిపేశారు.
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని 1993 ముంబై బ్యాక్ డ్రాప్ లో అప్పుడు జరిగిన సీరియల్ బాంబ్ బ్లాస్ట్య్ కు కారణమైన ఆర్డీఎక్స్ నేపథ్యంలో తెరకెక్కించారు. ‘బాలూ’, ‘పంజా’ చిత్రాల తర్వాత ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రలో కనువిందు చేశారు. ఇది పూర్తిగా అభిమానుల సినిమా అనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ ను ఎలాంటి రోలో చూపిస్తే..ఫ్యాన్స్ ఖుషీ అవుతారో.. అలాంటి క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ను చూపించాడు. వింటేజ్ లుక్ లో అదరగొట్టేసాడు. మధ్యలో హీరోయిన్ తో సీన్స్ మాత్రం పంటి కింద రాయిలా ఉన్నా.. క్లైమాక్స్ లో కూతురు సెంటిమెంట్ .. ముంబైను తన జపాన్ సమురాయ్ గ్యాంగ్ తో కాపాడటం వంటివి ఆసక్తి రేకిస్తాయి. రొటిన్ స్టోరీ అయినా.. సుజిత్ తనదైన ట్రీట్మెంట్ తో తన అభిమాన హీరోను ఎలా చూపించాలో అలా చూపించాడు. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘ఓజీ 2’ రాబోతున్నట్టు చెప్పడం కొసమెరుపు. ఈ సినిమా ఓవర్సీస్ లో ఉత్తర అమెరికాలో ప్రీమియర్స్ తో కలిపి 3.2 మిలియన్స్ నాన్ ప్యాన్ ఇండియా మూవీస్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు ఈ సినిమా ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టడం ఖాయం అనే ముచ్చట ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా మొదటి రోజు రూ. 125 కోట్ల గ్రాస్ నుంచి రూ. 150 కోట్ల రాబట్టే అవకాశం అని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.