)
OG Ticket Rate: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవి దానయ్య భారీ ఎత్తున నిర్మించాడు. ఈ సినిమాపై క్రేజ్ అంత కంతకు పెరుగుతుంది. తాజాగా ఓజీ సినిమా టిక్కెట్‌ను లక్ష రూపాయలకు దక్కించుకొని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
చిత్తూరులోని రాఘవ థియేటర్లో ఓజీ సినిమా మొదటి టికెట్‌ను అక్షరాలా లక్ష రూపాయలకు కొనుగోలు చేశాడు. ఆ లక్ష రూపాయలను పవన్ ఆఫీస్‌కు పంపించేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా డబ్బును పంపించేందుకు సిద్ధమైంది. మరోవైపు టికెట్ కొన్న అభిమాని శ్రీరామ్‌లోచన్‌ను పవన్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. అభిమానంతో టికెట్ కొనడమే కాదు… ఆ డబ్బును గ్రామాభివృద్ధి వాడాలన్న విషయం హర్షణీయం అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘ఓజాస్ గంభీర’ పాత్రలో కనిపించనున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ జపాన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో నార్త్ అమెరికాలో దాదాపు $3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదల వరకు ఏ మేరకు పోతుందో చూడాలి. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే.. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీని ఆపడం ఎవరి తరం కాదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.