OG Hindi Collections: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ హిందీ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఇవే..

OG Hindi Box Collections: పవన్ కళ్యాణ్ అభిమానులకు 2025 గుర్తుండి పోతుంది. ఈ యేడాది పవన్ నటించిన ‘హరి హర వీరమల్లు’,  ‘ఓజీ’ మూవీస్ అది కూడా రెండు నెలల గ్యాప్ లో  విడుదలయ్యాయి. అందులో ‘హరి హర వీరమల్లు’ పెద్దగా అలరించ లేకపోయింది. కానీ ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 15, 2025, 03:47 PM IST
OG Hindi Collections: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ హిందీ బాక్సాఫీస్ కలెక్షన్స్..  మొత్తం వసూళ్లు ఇవే..

OG Hindi Box Collections: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’.  దసరా నవరాత్రుల్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు దసరా సెలవుల అడ్వాంటేజ్ తో  ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయింది. అంతేకాదు ‘అత్తారింటికీ దారేది’ తర్వాత హిట్ స్టేటస్ అందుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది.  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 172.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు రూ. 174 కోట్ల గబ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగి ఓవరాల్ గా రూ. 180 కోట్ల షేర్ (రూ. 300 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మూడు ప్రాంతాలు మినహా మిగతా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేదు. కానీ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ భారత్, ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. 

Add Zee News as a Preferred Source

ఓజీ’ మూవీ  తొలి రోజే..రూ. 154 కోట్ల గ్రాస్ వసూల్లతో సంచలనం రేపింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ‘ఓజీ’ మూవీ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోనే ఫస్ట్ డే  వంద కోట్ల గ్రాస్ పైగా వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు పవన్ కెరీర్ లో ఫస్ట్ రూ. 100 కోట్ల షేర్.. తొలి రూ. 150 కోట్లు..రూ. 175 కోట్ల షేర్ తో సంచలనం రేపింది. ఈ సినిమా ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 180 కోట్ల షేర్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో రూ. 200 కోట్ల గ్రాస్.. రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా సంచలన విజయం నమోదు చేయడం విశేషం. తెలుగులో మాత్రం రూ. 12 కోట్ల నష్టాలను తీసుకొచ్చిన ఈ చిత్రం ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ తో హిట్ స్టేటస్ అందుకుంది.  

ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 3.60 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. అక్కడ లిమిటెడ్ గా కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే విడుదలైంది. అంతేకాదు ఈ సినిమాలోని కంటెంట్ బాలీవుడ్ మాస్ ఆడియన్స్ ను కనెక్ట్ అయ్యేలా ఉన్నా.. సరైన ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ సినిమా అక్కడ విడుదలైన విషయం చాలా మందికి తెలియదు. ఓవరాల్ గా హిందీలో రూ. 4.30 కోట్ల గ్రాస్ వసూళ్లతో పరుగును కంప్లీట్ చేసుకోవడం విశేషం.  

‘ఓజీ’ సినిమాకు ఓవర్సీస్  రూ. 17.50 కోట్ల బిజినెస్ కు గాను రూ. 32 కోట్ల షేర్ రాబట్టి బయ్యర్స్ కు  డబుల్ లాభాలను అందించింది. అక్కడ $5.52 మిలియన్ డాలర్స్ రాబట్ట సంచలనం రేపింది. మరోవైపు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 10 కోట్ల బిజినెస్ చేసింది. కానీ ఓవరాల్ గా రూ. 15 కోట్ల షేర్ రాబట్టి దాదాపు రూ. 5 కోట్ల లాభాలను తీసుకురావడం విశేషం. ఈ చిత్రం తమిళంలో రూ. 3.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేరళలో రూ. 30 లక్షల గ్రాస్ ను అందుకుంది. ఓవరాల్ గా కర్ణాటక మినహా మిగిలిన హిందీ, తమిళం, మలయాళంలో కలిపి రూ. 8.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సరైన ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేదని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట.  

Read more: గోవా నుంచి మన రాష్ట్రానికి ఎంత మద్యం తీసుకురావచ్చో తెలుసా..! చట్టం ఏం చెబుతోందంటే.. 

Read more: మన దేశంలో అత్యంత సంపన్న మంత్రులు వీళ్లే.. లిస్టులో తెలుగు వాళ్లే టాప్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News