
Hari Hara Veera Mallu New Release Date : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు.. చిత్రం ఎన్నో సంవత్సరాల ముందు షూటింగ్ ప్రారంభించుకుంది. అయితే ఈ సినిమాకి అడుగడుగునా కష్టాలే. ఎన్నో రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ తో.. కొద్దిరోజుల షూటింగ్ పెండింగ్ పడిపోయింది.
ఇక మధ్యలో దర్శకుడు క్రిష్ ఈ సినిమా ప్రాజెక్టు నుంచి తప్పుకోవటంతో.. ఈ సినిమా నిర్మాత ఎ.ఎం రత్నం కొడుకు.. జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. ఇలా దర్శకుడు మార్పుతో.. అలానే పవన్ కళ్యాణ్ షూటింగ్ పోస్ట్ పోన్ వల్ల.. ఈ చిత్రం వాయిదా పడుతూనే వచ్చింది.
ఇక ఫైనల్ గా ఈ సినిమా జూన్ 12న విడుదల చేస్తున్నాము అనగానే.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల తర్వాత తమ హీరోని స్క్రీన్ పైన చూస్తాము అని.. సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ తేది మాత్రం.. మారదు అని నిర్మాత కూడా నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా వాయిదా పడుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని వీఎఫ్ఎక్స్ వర్కులు పూర్తి కాకపోవడం వల్ల.. ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించుకొన్నట్టు సమాచారం.
ఎందుకు తగ్గట్టుగానే అమెరికాలో ఈ సినిమా టికెట్లను ఆన్లైన్ నుంచి కూడా తీసేయడంతో.. ఈ చిత్రం తప్పకుండా వాయిదా పడుతుంది అనే క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలో.. నిర్మాతకు ఈ సినిమా వల్ల.. విడుదలకు ముందే కొద్దిగా నష్టం వస్తూ ఉండటంతో.. పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ నుంచి 11 కోట్లు వెనక్కి ఇచ్చేశారు అని సమాచారం.
అంతేకాకుండా ఈ సినిమాని జూలై మొదటి వారంలో విడుదల చేయాలి అనుకుంటున్నారంట సినిమా యూనిట్. ఈ సినిమా సెన్సార్ కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు. మరోపక్క ఈ చిత్రం..థియేటరికల్ బిజినెస్ పూర్తి కాకపోవడంతో.. నిర్మాత టెన్షన్లో ఉన్నారంట. ఇక నిర్మాత ఇబ్బందులు చూసి తన రెమ్యునరేషన్ దాదాపు రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేసారంట పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ తెలిసిందే. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా ఫ్రీ రిలీజ్ విషయంలో ఇలాంటి.. ఇబ్బందులు రావడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాకు ఉండే.. అంచనాలు కూడా ఈ సినిమాకి పెద్దగా కనిపించడం లేదు. మరి విడుదలయ్యాకన్నా ఈ చిత్రం ఈ అవంతరాలు అన్ని దాటి.. మంచి విజయం సాధిస్తుందేమో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.