Pawan Kalyan: రామ్ చరణ్ నుండి అప్పు తీసుకున్న పవన్ కల్యాణ్.. అది కూడా వడ్డీకి.. ఎంతంటే..?

Ram Charan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయాలు, సినిమాల మధ్య ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి..రామ్ చరణ్‌తో గతంలో జరిగిన ఆర్థిక విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  రామ్ చరణ్ దగ్గర ఏకంగా పవన్ కళ్యాణ్ అప్పు తీసుకున్నారంట.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya | Last Updated : Mar 3, 2025, 01:33 PM IST
Pawan Kalyan: రామ్ చరణ్ నుండి అప్పు తీసుకున్న పవన్ కల్యాణ్.. అది కూడా వడ్డీకి.. ఎంతంటే..?

Pawan Kalyan borrows from Ram Charan: పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో ఆయన ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. రాజకీయ బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నా, ఆయన వద్ద ముగించాల్సిన మూడు సినిమాలు ఉన్నాయి. వీటిని త్వరలోనే పూర్తి చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు.  

Add Zee News as a Preferred Source

మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కల్యాణ్ విజయంతో ప్రస్తుతం ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే ఆయన గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ ఒకప్పుడు రామ్ చరణ్ నుండి అప్పు తీసుకున్నాడన్న విషయం తెలుసా? ఇది ఆశ్చర్యకరం అనిపించవచ్చు, ఎందుకంటే పవన్ కల్యాణ్ ఒక స్టార్ హీరో. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కల్యాణ్ కోట్లాది రూపాయల ఆస్తులను కలిగి ఉన్నా, ఆయన రామ్ చరణ్ నుండి ఎందుకు అప్పు తీసుకోవాల్సి వచ్చిందనే విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.  

మెగా ఫ్యామిలీకి చెందిన ఒక ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి.. స్వయంగా చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వెల్లడించడం విశేషం. ఇది ఇటీవలి కాలంలో జరిగిన విషయం కాదు. ఒకప్పుడు పవన్ కల్యాణ్ ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. అప్పట్లో అతని దగ్గర డబ్బు ఉండేది కాదు. ఆ సమయంలో అతడు రామ్ చరణ్ వద్ద నుండి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడంట. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే.. ఇది రామ్ చరణ్ సినిమాల్లోకి రాకముందు జరిగిన ఘటన. ఆ సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండేది. పవన్ కల్యాణ్ తన నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటి రోజుల్లోనే ఆయనకు డబ్బు కొరత ఏర్పడింది. చిరంజీవి ఇచ్చే డబ్బు సరిపోకపోవడంతో ఇతర మార్గాల కోసం వెతకాల్సి వచ్చింది. ఆ సమయంలో రామ్ చరణ్ తన ఖర్చులకు చిరంజీవి ఇచ్చే పొకెట్ మనీని సేవ్ చేసేవాడంట. పవన్ కల్యాణ్ ఆ పొకెట్ మనీనే అప్పుగా తీసుకునేవాడు.  

Pawan Kalyan borrows loan from Ram Charan ; అప్పుగా తీసుకున్న డబ్బును ఎక్కువ వడ్డీతో తిరిగి ఇస్తానని చెప్పి రామ్ చరణ్‌ను మోసం చేసేవారని ఎంతో తమాషాగా వారు ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. చిన్న వయసులో ఉన్న రామ్ చరణ్‌కు ఈ మాటలు నమ్మి డబ్బు ఇచ్చే వార్త. పవన్ కల్యాణ్ తన ఖర్చులకోసం కోసం రామ్ చరణ్ వద్ద డబ్బు తీసుకోవడానికి చిన్న చిన్న కథలు చెప్పేవాడు.  

ఇంటర్వ్యూలో ఈ సంఘటనను గుర్తు చేసుకున్న రామ్ చరణ్, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు. పవన్ తన చిన్ననాటి ఆర్థిక కష్టాలను ఇలా సరదాగా గుర్తు చేసుకున్నాడు. 

 

ప్రస్తుతం.. రామ్ చరణ్ తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. గతంలో 'గేమ్ ఛేంజర్' సినిమా నిరాశ పరచడంతో, తన కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  మరోవైపు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నెరవేరుస్తూ, తన పెండింగ్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తానని చెప్పాడు.

Also read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ రికార్డులు, దుబాయ్ పిచ్ రిపోర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News