Pawan Kalyan Vs Tollywood: టాలీవుడ్ సినీ పెద్దలు మెడలు వంచడంలో పవన్ కళ్యాణ్ సఫలీకృతులయ్యారా అంటే ఔననే సమాధానం వస్తోంది. అందుకే ఈ నెల 15న టాలీవుడ్ పెద్దలు చంద్రబాబును కలిసేందకు సినీ పెద్దలు రాబోతున్నారు. గతంలో సీఎంను కలవకుండా కొందరు అడ్డుకున్నారనే ప్రచారం ముంది. ఇప్పుడు సీఎంతో భేటీకి వారంతా వస్తారా..! లేక మీటింగ్‌కు డుమ్మా కొడతారా అనేది ఆసక్తిరకంగా మారింది. టాలీవుడ్ సినీ పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు సిద్దమయ్యారు. ఈనెల 15వ సినీ ఇండస్ట్రీ పెద్దలంతా అమరావతికి వెళుతున్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu)తో సమావేశం కానున్నారు. టాలీవుడ్ బృందానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఉండవల్లిని చంద్రబాబు నివాసంలోనే సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ధియేటర్ల బంద్ విషయంలో కొంత మంది పవన్ కల్యాణ్ సినిమాపై కుట్ర చేయడంతో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలను మర్యాద పూర్వకంగా కూడా కలవకుండా.. పైగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం వేధించుకుతిన్నదని అయినా.. తాము సానుకూలంగా స్పందించి అన్ని విధాలా సహకారం అందిస్తే ఇలా చేస్తారా అని టాలీవుడ్ పెద్దలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.. దాంతో అలర్ట్ అయినా టాలవుడ్ పెద్దలు నష్టనివారణ చర్యలకు దిగారు. అందుకే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంతో భేటీకి దిక్కులేని పరిస్థితుల్లో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో థియోటర్ల బంద్‌పై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ నిర్ణయం తీసుకోవడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత టాకీస్ లపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే హరి హర వీర మల్లు వాయిదా పడింది. అయితే పవన్‌కల్యాణ్ సీరియస్ కావడంతో టాలీవుడ్ పెద్దలపై విమర్శలు పెరిగాయి. దాంతో అలర్ట్ అయినా సినీపెద్దలు వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. టాలీవుడ్ బాగుకోసం డిప్యూటీ సీఎం సూచనలు, సలహాలు స్వీకరిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ తనకు అన్న లాంటి వారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇప్పుడు సినీ పెద్దలు పవన్ సారధ్యంలోనే చంద్రబాబు ను కలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 30 మంది వరకు సినీ రంగ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలవనున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, దిల్ రాజు సినీ ఇండస్ట్రీ తరపున తమ సమస్యలను చంద్రబాబుకు వివరించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు కలిసేందుకు ఎంత మంది సినీ పెద్దలు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొంత మంది పెద్దలు వైసీపీ అధినేత వైఎస్ జగన్, మరికొందరు నేతలకు అంత్యంత సన్నిహితులుగా ఉన్నారు. వారు గతంలో ప్రభుత్వ పెద్దల్ని కలవకుండా.. ఇతరులని ఆపేశారన్న ప్రచారం ఉంది. అల్లు అరవింద్ కూడా ఈ విషయం చెప్పారు. కలుద్దామంటే.. మనది ప్రైవేటు వ్యాపారం కాబట్టి కలవాల్సిన అవసరం లేదనే విషయాన్ని చెప్పారు. ఆయనెవరో ఇండస్ట్రీకి తెలుసు. అందుకే .. ఈ విషయంలో అయినా ఇండస్ట్రీ ఐక్యంగా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉందని అంటున్నారు.
మొత్తంమీద సీఎం చంద్రబాబుతో భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మీటింగ్ లో థియేటర్ల సమస్యలు, టికెట్ రేట్ల పెంపు, థియేటర్స్ లో తినుబండారాల రేట్లపై చర్చించే అవకాశం ఉందట. మరోవైపు ఏపీలో సినిమా షూటింగ్స్, నంది అవార్డుల అంశాలన్నీ ప్రస్తావనకు రానున్నట్టు సమాచారం. అప్పట్లో ఏపీలోలో చంద్రబాబు ప్రభుత్వం 2012 నుంచి 2016 వరకు మొత్తంగా ఐదేళ్లకు సంబంధించిన నంది అవార్డులను ప్రకటించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. దీంతో నంది అవార్డుల ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం నంది అవార్డుల గురించి అసలు పట్టించుకోలేదు. రీసెంట్ గా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కార్.. తెలంగాణ గద్దర్ సినిమా అవార్డ్స్ పేరిట 2024 యేడాదికి గాను అవార్డులు వచ్చింది. అటు తెలంగాణ ఏర్పడిన తర్వాత సెన్సార్ అయిన చిత్రాలకు ఉత్తమ, ద్విదీయ, తృతీయ చిత్రాలు అవార్డులకు ప్రకటించింది. దీంతో ఏపీలో కూడా నంది అవార్డుల ఎపుడు ఇస్తారనే అంశం తెరపైకి వచ్చింది. పైగా ఏపీలో ఉన్నది సినీ ఇండస్ట్రీకి అత్యంత సన్నిహితమైన ప్రభుత్వం కాబట్టి.. 2017 నుంచి 2024 వరకు 8 యేళ్లకు గాను నంది అవార్డ్స్ ప్రకటించే అవకాశం ఉందనే ముచ్చట కనిపిస్తుంది. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం చంద్రబాబుతో భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..
Also Read: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఎన్టీఆర్, బాలకృష్ణలకు మాత్రమే సొంతం..
Also Read: ఈ పుట్టినరోజు నందమూరి బాలకృష్ణకు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.