Anna Lezhneva: పవన్ కళ్యాణ్ కుమారుడి కోసం తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. సతీమణి లెజినోవా ఎంత ఇచ్చారంటే!

Anna Lezhneva donates 17 lakhs: పవన్ కళ్యాణ్ కుమారుడికి ఈ మధ్య అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రమాదం నుంచి అదృష్టం కొద్దీ బయటపడ్డారు. ఇక సింగపూర్ నుంచి ఈ మధ్యనే తన కొడుకు.. తన భార్యతో పవన్ ఇండియాకి వచ్చారు. ఈ క్రమంలో ఇండియాకి రాగానే పవన్ కళ్యాణ్ భార్య తిరుమల శ్రీవారిని దర్శించుకుని అక్కడ అన్నదానం కోసం భారీ విరాళం ఇచ్చారు.  

Written by - Vishnupriya | Last Updated : Apr 14, 2025, 01:48 PM IST
Anna Lezhneva: పవన్ కళ్యాణ్ కుమారుడి కోసం తిరుమల శ్రీవారికి  భారీ విరాళం.. సతీమణి లెజినోవా ఎంత ఇచ్చారంటే!

Pawan Kalyan Wife: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె సోమవారం వేకువజామున నిర్వహించిన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు పూర్వాహ్నంలో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

Add Zee News as a Preferred Source

తిరుమల పర్యటన సందర్భంగా అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ పేరిట టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళంగా అందజేశారు. ఇటీవలే మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదంలో గాయపడగా, ప్రమాదం నుంచి బయటపడినందుకు శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చారు.

ఆమె ఆదివారం తిరుమలకు చేరుకున్న తరువాత పద్మావతి గెస్ట్‌హౌస్ వద్ద తలనీలాలు సమర్పించారు. భూవరాహ స్వామి దర్శనం అనంతరం గాయత్రి నిలయంలో బస చేశారు. తిరిగి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అర్చనలు పూర్తయిన తరువాత బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నవితరణ కేంద్రంలో ప్రసాదాలు స్వీకరించారు.

ఈ నెల 8వ తేదీన మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఒక టమాటో కుకింగ్ స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స అనంతరం ఇంటికి విడుదలయ్యారు. ఈ ఘటన తరువాత కుటుంబం భారతదేశానికి చేరుకుని తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కుమారునికి ఇలా జరిగింది అని తెలిసిన వెంటనే సింగపూర్ కి బయలుదేరి.. ఆ తరువాత ఈ మధ్యనే కొడుకుతోపాటు ఇండియాకి వచ్చారు. ఇక పాలిటిక్స్ తో పాటు సినిమాలపరంగా కూడా బిజీబిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. 

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమాని మే తొమ్మిదిన్న విడుదల చేస్తాము అని వెలదించారు చిత్ర యూనిట్. ఈ సినిమాకి ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా అతని కొడుకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం మొదట కొంచెం భాగం మాత్రం దర్శకుడు క్రిష్ డైరెక్షన్ వహించారు. ఈ చిత్రంతో పాటు సుజిత్ దర్శకత్వంలో రానున్న ఓజీ షూటింగ్లో కూడా యమ బిజీగా ఉన్నారు పవన్.

Also Read: Telangana SC Reservation: నేటి నుంచి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ అమలు.. 30 ఏళ్ల పోరాటానికి ఫలితం..

Also Read: Telangana Rains: అకాల వర్షంతో అంతా ఆగమాగం.. తెలంగాణలో  2 రోజుల పాటు భారీ వర్షాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News