)
Hari Hara Veera Mallu OTT Streaming: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వెళ్లి తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూసారు. కానీ ఈ సినిమా స్టోరీ బాగున్నా.. విజువల్స్ పరంగా వీక్ గా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 70 కోట్లకు పైగా షేర్ (రూ. 135 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.ఇక థియేట్రికల్ ఈ సినిమా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ సగం మాత్రమే ఈ సినిమా రివకరీ చేసింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిందీ, కన్నడలో మాత్రం స్ట్రీమింగ్ కు రాలేదు. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్నిఅందించారు.
పీరియడ్ అడ్వెంచర్ జానర్లో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, సచిన్ ఖేడ్కర్, నాజర్, రఘుబాబు వంటి ప్రముఖ నటులు లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. మన దేశాన్ని దుర్మార్గంగా పాలించిన మొఘల్ కాలం నాటి ఈ కథలో, హరి హర వీరమల్లు అనే ఒక ధైర్యవంతుడు చక్రవర్తి ఔరంగజేబు కోట నుండి ప్రసిద్ధ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడానికి ఢిల్లికి బయలుదేరుతాడు. ఈ క్రమంలో రాజకీయ కుట్రలు,యుద్ధాలు, సాహసాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది.ధర్మ రక్షణ కోసం హరి హర వీరమల్లు ఏం చేసాడనేదే ఈ సినిమా స్టోరీ. పవన్ కళ్యాణ్ చిత్రాల విషయానికొస్తే.. వచ్చే నెల 25న విడుదల కాబోతుంది. మరోవైపు ఈయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.