Hari Hara Veera Mallu:‘హరి హర వీరమల్లు’ సినిమా విషయంలో అభిమానులకు పవన్ కళ్యాణ్ నిజంగా ఆ సర్ప్రైజ్ ఇస్తాడా..!

Hari Hara Veera Mallu: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. అంతేకాదు తన కున్నంత సమయంలో ఉన్న చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా ఈ సినిమాను విడుదలైన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండో పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా విడుదల అనుకున్న టైమ్ కు విడుదల అవుతుందా అని అభిమనులు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 25, 2025, 01:55 AM IST
Hari Hara Veera Mallu:‘హరి హర వీరమల్లు’ సినిమా విషయంలో అభిమానులకు పవన్ కళ్యాణ్ నిజంగా ఆ సర్ప్రైజ్ ఇస్తాడా..!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. ఫేమస్ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు.   పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమాకు పద్మశ్రీ  ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  'హరి హర వీర మల్లు' చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన'మాట వినాలి' పాట ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది.  ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ పాటకు సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

Add Zee News as a Preferred Source

'హరి హర వీర మల్లు' నుంచి రెండవ పాట 'కొల్లగొట్టినాదిరో'  అద్భుతంగా ఉంది. హీరోయిన్ నిధి అగర్వాల్ తో పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీ అదిరిపోయింది.  ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ లిరికల్ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అలాగే ఈ పాటలో అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ మెరిసి తమ నృత్యంతో అదనపు ఆకర్షణగా నిలిచారు.

 ఎం.ఎం. కీరవాణి స్వరాలు అందిస్తోన్న 'కొల్లగొట్టినాదిరో' గీతం మ్యూజిక్ లవర్స్ ను  మంత్రముగ్ధులను చేస్తోంది. బహుళ భాషల్లో విడుదలైన ఈ గీతాన్ని ప్రతిభగల గాయనీ గాయకులు మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల, ఐరా ఉడిపి, మోహన భోగరాజు, వైష్ణవి కన్నన్, సుదీప్ కుమార్, అరుణ మేరీ పాడారు. ఈ పాటను తెలుగులో చంద్రబోస్, తమిళంలో పా. విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యాన్ని అందించడం విశేషం.  

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

హరి హర వీరమల్లు చిత్రం 17వ శతాబ్దపు మన దేశాన్ని పట్టి పీడించిన దుర్మార్గ పాలకులైన మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడు ‘హరి హర వీరమల్లు’ గా నటిస్తున్నాడు.  ఈ చిత్రంలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  

'హరి హర వీరమల్లు' చిత్రానికి చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయడం పక్కా అని చెబుతున్నారు. ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని చిత్ర బృందం ఎన్నో హోప్స్ పెట్టుకుంది.

ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, 'బాహుబలి' ఫేమ్ శ్రీనివాస్ మోహన్ అందించారు. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News