Police Vaari Hecharika: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ‘పోలీస్ వారి హెచ్చరిక’.. మూవీ సాంగ్ ను లాంచ్ చేసిన సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్..

Police Vaari Hecharika: తెలుగు సినీ పరిశ్రమలో అభ్యుదయ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న  బాబ్జీ తెరకెక్కించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ వారి హెచ్చరిక’. తాజాగా ఈ సినిమా నుంచి ఒక డిఫరెంట్  ప్రేమగీతం ఆవిష్కరణ జరిగింది. ఈ సినిమాలో విలన్లు ప్రేమగీతాలు పాడుకునే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు.  ఈ పాటను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 10, 2025, 10:00 PM IST
Police Vaari Hecharika: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ‘పోలీస్ వారి హెచ్చరిక’.. మూవీ సాంగ్ ను లాంచ్  చేసిన సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్..

Police Vaari Hecharika: తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ నిర్మాణంలో బాబ్జీ దర్శకత్వంలో ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “సాధారణంగా సినిమాల్లో హీరో-హీరోయిన్లు యుగళ గీతాలు పాడుకుంటారు. కానీ, ఈ సినిమాలో విలన్లు డ్యూయెట్‌లు పాడుకోవడం ఒక వెరైటీ కాన్సెప్ట్ అని చెప్పాలి. ఈ సినిమా విడుదలైన తర్వాత విలన్లకు కూడా డ్యూయెట్‌లు పెట్టే ట్రెండ్ స్టార్ట్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  ఇలాంటి సరికొత్త పాటను ఆవిష్కరించే ఛాన్స్ రావడం నాకు ఆనందంగా ఉందన్నారు.

Add Zee News as a Preferred Source

దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ, “పోలీస్ వారి హెచ్చరిక’ సినిమా పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామన్నారు. త్వరలో సెన్సార్ పనులు పూర్తి చేసి, ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నామన్నారు.  నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ..ఈ చిత్రాన్ని   తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఆడియన్స్ కు  ఈ చిత్రం ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఈ సినిమాలో  సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, గిద్దెష్, శుభలేఖ సుధాకర్, షాయాజీ షిండే, హిమజ, జయవాహిని, శంకరాభరణం తులసి, ఖుషి మేఘన, రుచిత, గోవిందా, హనుమ, బాబురామ్ తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News