Don Bosco Update: SIIMA & AHA అవార్డులలో ఉత్తమ డెబ్యూటెంట్ ప్రొడక్షన్ హౌస్‌గా గుర్తింపు పొందిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్, శ్రీ మాయ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న..తాజా చిత్రం "డాన్ బోస్కో". రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని, శైలేష్ రామ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పి.శంకర్ గౌరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత నాగ వంశీ ముఖ్య అతిథిగా హాజరై, అధికారిక పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేశారు. ముహూర్తం షాట్‌కు నిర్మాత సాహు గారపాటి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చుక్కపల్లి సురేష్ క్లాప్ ఇచ్చారు. చిన్నబాబు స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా "డాన్ బోస్కో" టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో "వెల్‌కమ్ టు ది క్లాస్ రీయూనియన్ - బ్యాచ్ 2014", "అన్ని రీయూనియన్లు జ్ఞాపకాల కోసం కాదు; కొన్ని విముక్తికి సంబంధించినవి" అనే క్యాప్షన్లు ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌లోని "మోస్ట్ వాంటెడ్ బోర్డు" పోస్టర్‌లో చూపిస్తూ, సినిమాలోని సస్పెన్స్‌ను హింట్ చేశారు.
ఈ చిత్రంలో మురళీ శర్మ ప్రిన్సిపాల్ విశ్వనాథ్‌గా కీలక పాత్ర పోషిస్తుండగా, మిర్నా మీనన్ లెక్చరర్ సుమతిగా కనిపించనున్నారు. అలాగే రుష్య, మౌనిక, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, విష్ణు ఓయ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.
కామెడీ, సస్పెన్స్, భావోద్వేగాలతో సాగే "డాన్ బోస్కో" ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుంది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్, శ్రీ మాయ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమే కాకుండా, మంచి విజయాన్ని సాధించే అవకాశాలున్నాయి. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: EPFO Updates: పీఎఫ్ ఖాతాదారులకు డబుల్ జాక్‌పాట్.. ఒకేసారి రెండు శుభవార్తలు..!
Also Read: Sai Pallavi: అబ్బాయిలు అలా ఉంటేనే ఇష్టం.. మనసులోని మాట బైటపెట్టిన సాయి పల్లవి.. మ్యాటర్ ఏంటంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









