హీరో నితిన్ సరసన పూజ హెగ్డే

 నితిన్,  పూజ హెగ్డే జంటగా సరికొత్త మూవీ తెరపైకి రానుంది

Last Updated : Dec 5, 2017, 08:12 PM IST
హీరో నితిన్ సరసన పూజ హెగ్డే

కృష్ణ చైతన్య డైరెక్షన్ లో 25వ సినిమా చేస్తున్న నితిన్ త్వరలో ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. దిల్ రాజు నిర్మాణంలో యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుందనే టాక్ వినిపిస్తుంది.

లేటెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘డీజే’లో నటించి తన గ్లామర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన ఈ స్టన్నింగ్ బ్యూటీ ఈ సినిమాకు ఆల్మోస్ట్ ఫిక్స్ అనే వార్త చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం బెల్లం కొండ శ్రీనివాస్ తో ‘సాక్ష్యం’ సినిమాలో నటిస్తున్న పూజ నెక్స్ట్ నటించే సినిమా ఇదే అనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది.

Trending News