Pooja Hegde: రామ్ చరణ్ కు పూజా హెగ్డే పంచ్…?టికెట్లు తెగాలి కదా అంటూ..!

Pooja Hegde About Instagram Followers: పూజా హెగ్డే ప్రస్తుతం సూర్య హీరోగా వస్తోన్న రెట్రో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం కాగా ఈ చిత్ర ప్రమోషన్ లో తెగ పాల్గొంటుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..

Written by - Vishnupriya | Last Updated : Apr 18, 2025, 05:16 PM IST
Pooja Hegde: రామ్ చరణ్ కు పూజా హెగ్డే పంచ్…?టికెట్లు తెగాలి కదా అంటూ..!

Ram Charan Instagram: తెలుగులో ఎన్నో సినిమాలలో కనిపించి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది పూజ హెగ్డే. సాధారణంగా ఎవరైనా హీరోయిన్ అయిన తరువాత ఐటమ్ సాంగ్స్ చేస్తారు. కానీ పూజా హెగ్డే కి రంగస్థలంలో జిగేలురాణి పాత చేసిన తర్వాత ఎక్కువ పాపులారిటి వచ్చింది. ఆ తరువాత ఈ హీరోయిన్ కి అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చాయి. దాంతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారింది ఈ ముద్దుగుమ్మ. 

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత, అలా వైకుంఠపురం లో లాంటి చిత్రాలు ఈమెకు బ్లాక్ బస్టర్ విజయాలను అందించాయి. అయితే ఆ తరువాత వరుస ప్లాపులు రావడంతో ఆమె దృష్టి బాలీవుడ్ వైపు తిప్పుకుంది. కానీ అక్కడ కూడా పూజకు అనుకున్న విజయాలు అందలేదు. 

ముఖ్యంగా సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసినా కానీ అది ఫ్లాప్ గానే మిగిలింది. ఇక ప్రస్తుతం మళ్ళీ సౌత్ సినిమాల పైన తన దృష్టి పెడుతోంది పూజా హెగ్డే. ఈ క్రమంలో త్వరలోనే సూర్య హీరోగా రాబోతున్న రెట్రో సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూకి హాజరైన పూజ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. 

“ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన.. వాళ్లంతా సినిమాలకు వస్తారని కాదు. ఇంస్టాగ్రామ్ లో 27 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న.. టికెట్లు తెగాలి కదా..,” అని చెప్పుకొచ్చింది. అయితే కొంతమంది సూపర్ స్టార్స్ కి మాత్రం ఐదు మిలియన్స్ కన్నా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారని.. కానీ వాళ్ళ సినిమాలో కోట్ల మంది చూస్తున్నారని తెలియజేసింది. ఈ క్రమంలో పూజ చెప్పిన ఈ మాటలను కొంతమంది రామ్ చరణ్ యంటీ ఫ్యాన్స్ వేరే విధంగా వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో రామ్ చరణ్ కు 27 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆయన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక పూజ 27 మిలియన్ అనగానే.. ఈ పోస్ట్ కి కింద రామ్ చరణ్ instagram పేజ్ ఫాలోవర్స్ ఫోటో పెట్టి.. అది వీడియో గా చేసి వైరల్ చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. 

 

అయితే పూజా హెగ్డే కి కూడా 20 మిలియన్ల పైనే ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి ఆమె అది సాధారణంగానే చెప్పింది అని.. ఇలా సోషల్ మీడియాలో కొంతమంది పనీపాటా లేకుండా ఇలాంటి పోస్టులు చేస్తూ ఉంటారు అని మరి కొంతమంది విమర్శలు కురిపిస్తున్నారు.

Also Read: Viral Video: సుత్తి లేదు.. రంపం లేదు.. ఈ ట్రిక్‌తో తాళం ఊడి వచ్చేస్తుంది, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..  

Also Read: AP Rains: ఇటు గాలులు.. అటు పిడుగులు.. ఏపీకి బిగ్ అలర్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News