The Raja Saab: రేపే ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ టైమ్ లాక్..!

The Raja Saab Teaser Time: ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్నది రాజా సాబ్ సినిమా టీజర్ ముహూర్తాన్ని మేకర్స్ ఫిక్స్ చేశారు. దీంతో పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ప్రభాస్ అభిమానులకు పండగ మొదలైపోయింది..

Written by - Vishnupriya | Last Updated : Jun 15, 2025, 08:23 PM IST
The Raja Saab: రేపే ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ టైమ్ లాక్..!

Raja Saab Teaser Time: డైరెక్టర్ మారుతి,  ప్రభాస్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్.. ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు సైతం ఇటీవల చిత్ర బృందం ప్రకటిస్తూ ఉన్నది. ముఖ్యంగా సినిమా రిలీజ్ తేదీతో పాటు టీజర్ రిలీజ్ ని కూడా చిత్ర బృందం ఇటీవలే తెలియజేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లోనే నిర్మిస్తూ ఉన్నారు. 

Add Zee News as a Preferred Source

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండగా అందుకు తగ్గట్టుగానే హీరోయిన్స్ ని కూడా ఎంపిక చేయడం జరిగింది. నిధి అగర్వాల్, మాళవిక మోహన్ నటిస్తూ ఉన్నారు. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురుచూసే టీజర్ టైమ్ కూడా చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.  జూన్ 16 ఉదయం 10:52  నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 

డైరెక్టర్ మారుతి తన ట్విట్టర్ నుంచి ఆల్ సెట్ డార్లింగ్స్.. లెట్స్ రాక్ ఫ్రమ్ టుమారో అంటూ ఒక ట్విట్టర్ తో ప్రభాస్ ఫోటో ని షేర్ చేయడం జరిగింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఫోటోని వీటిని వైరల్ గా చేస్తున్నారు. 
ప్రభాస్ కెరియర్ లోనే మొదటిసారి ఒక రొమాంటిక్ హర్రర్ చిత్రంలో నటిస్తూ ఉన్నారు.

ది రాజా సాబ్ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది. సంగీతాన్ని తమన్ అందిస్తూ ఉన్నారు. మరి టీజర్ తో ప్రభాస్ అభిమానులను ఏ విధంగా ఖుషీ చేస్తారో చూడాలి మరి.

ఇకపోతే గత రెండు రోజుల క్రితం ఈ సినిమా టీజర్ ను కొంతమంది లీక్ చేసిన విషయం తెలిసిందే.దీంతో మండిపడ్డ చిత్ర బృందం వెంటనే వార్నింగ్ కూడా ఇచ్చింది. రేపు రాబోయే టీజర్ కోసం అభిమానులు కూడా ఎంతో ఎదురు చేస్తున్నారు.

Read more: Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News