Prabhas Herione: తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై ఇచ్చిపడేసిన ప్రభాస్ హీరోయిన్..!

Iman V Ismail: మంగళవారం పహల్గామ్ దాడి తర్వాత ప్రభాస్ సినిమాల్లో పాకిస్తాన్ నటి ఇమాన్వినీ తీసుకున్నారంటూ వార్తలు ప్రచారం చేస్తున్న వేళ ఇమాన్వీ స్పందించింది.

Written by - Vishnupriya | Last Updated : Apr 24, 2025, 02:25 PM IST
Prabhas Herione: తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై ఇచ్చిపడేసిన ప్రభాస్ హీరోయిన్..!

Fauji Actress Tweet on Phalagam Terror Attack : హీరో ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో  ఫౌజీ సినిమాని అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరోయిన్ గా  ఇమాన్వి ఇస్మాయిల్ అనే అమ్మాయిని తీసుకున్నారు. వాస్తవానికి ఈమె పాకిస్తానీ అని,ఈమె తండ్రి గతంలో పాకిస్తాన్ ఆర్మీలో కూడా పనిచేసి రిటైర్డ్ అయ్యారనే విధంగా మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇటీవలే జరిగిన ఉగ్రవాది దాడిలో భాగంగా పాకిస్తాన్ నటిని ఎందుకు తీసుకున్నారంటూ చాలామంది అటు ప్రభాస్ ని, ఇటు డైరెక్టర్ ని విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. 

Add Zee News as a Preferred Source

ఈ విమర్శలు అటు ఇమాన్వి వరకు వెళ్లడంతో దీనిపైన స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక విషయాన్ని తెలియజేసింది. తన పోస్టులో తాను ఇలాంటి వైలెన్స్ ని తీవ్రంగా ఖండిస్తానని, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ తన నివాళులు అంటూ.. తన ఐడెంటిటీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని,  అందుకే దానిపైన క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానని తెలిపింది. 

మా ఫ్యామిలీలో ఎవరికీ కూడా పాకిస్తాన్ మిలిటరీతో ఏ రకంగా కూడా సంబంధం లేదని,  కేవలం తనమీద ద్వేషంతో ఇలాంటివి వ్యాప్తి చేయాలని కొంతమంది చేస్తున్నారంటూ ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలియజేసింది. 

కొన్ని మీడియా సంస్థలు సరిగ్గా పరిశోధించకుండానే ఇలాంటి విషయాలను వైరల్ గా చేస్తున్నారు.  తాను ఇండో - అమెరికన్ ని అంటూ తెలిపింది. తనకు హిందీ, తెలుగు, గుజరాత్, ఇంగ్లీష్ అన్ని కూడా మాట్లాడతానని,  అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జన్మించానని,  తన పేరెంట్స్ కూడా కాలిఫోర్నియాలో యంగ్ గా ఉన్నప్పుడే వెళ్లిపోయారు. అక్కడే అమెరికా సిటిజన్ కూడా పొందాను అంటూ తెలిపింది. తన చదువు అంతా కూడా అమెరికాలోనే కొనసాగింది.. ఆ తరువాతే తాను కొరియోగ్రాఫర్ గా పని చేశానని,  ఆ తర్వాతే తనకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పని చేసే అవకాశం లభించింది అని కూడా తెలిపింది.. 

తన రక్తంలో ప్రవహించేది ఇండియన్ రక్తమే అంటూ తెలిపింది ఇమాన్వి.. తాను కూడా సంస్కృతి కలిగిన వ్యక్తిని, ఇలాంటి సమయాలలో మనం ప్రేమను వ్యాప్తి చేయాలి అంటూ తెలిపింది.. తాను ఇండియన్ వారసత్వాన్ని సంస్కృతిని కూడా వ్యాప్తి చేయడానికి చాలా కష్టపడతానంటూ పోస్ట్ ద్వారా తెలిపి తనకు,  పాకిస్థాన్ కి ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చింది ప్రభాస్ హీరోయిన్.

Read more: Navy Officer Couple Dance Video: పెళ్లి తర్వాత భార్యతో ఆర్మీ అధికారి డ్యాన్సులు.. ఎంత చక్కగా చేశారో..?.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News