Prabhas Kalki 2 Update : 2024లో విడుదలైన మైథలాజికల్ సై-ఫై ఎపిక్.. కల్కి 2898 ఏడి సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ లాంటి స్టార్ నటులు..నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘనవిజయం సాధించింది. ఈ విజయం తర్వాత ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా కల్కి రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నారు.
మహానటి సినిమా మంచి విజయం సాధించిన తర్వాత.. ఎన్నో సంవత్సరాల గ్యాప్ ఇచ్చి నాగ్ అశ్విన్ కల్కి మొదటి భాగం తెరకెక్కించారు. ఈ క్రమంలో మళ్లీ రెండో భాగం కోసం ఎంతటి సమయం తీసుకుంటారో అని అందరూ కంగారుపడుతున్న సమయంలో.. నాగ అశ్విన్ ఈమధ్య చేసిన వ్యాఖ్యలు కాస్త ఈ చిత్రానికి ప్రభాస్ అభిమానులు ఇంకా తొమ్మిది సంవత్సరాల పాటు వెయిట్ చేయక తప్పదు అనేలా ఉన్నాయి.
ఇటీవలి తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించిన దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ..కల్కి 2 స్క్రిప్ట్ పని శరవేగంగా జరుగుతోందని తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నట్టు..ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఈ సీక్వెల్‌లో ప్రభాస్ పోషించిన కర్ణుడి పాత్ర మరింత ముఖ్యంగా ఉండనుందని, కథ మొత్తం కర్ణుడు.. అశ్వత్థామల చుట్టూ తిరుగుతుందని చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.
అయితే సినిమా రిలీజ్ ఎప్పుడు అనే ప్రశ్నకు నాగ్ అశ్విన్ చేసిన హ్యూమరస్ రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. “మొదటి భాగం రిలీజ్ చేయడానికి మూడు లేదా నాలుగు గ్రహాలు కలిసినప్పుడు ప్లాన్ చేశాం. ఇప్పుడు ఏడో, ఎనిమిదో గ్రహాల కలయిక జరగాలి అప్పుడే కల్కి 2 రిలీజ్ అవుతుందేమో” అని నవ్వుతూ చెప్పారు. కానీ ఆయన మాటలు అభిమానుల్ని ఆలోచనలో పడేశాయి.
దీనితో కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా ఏడుగ్రహాల కలయిక ఎప్పుడు జరుగుతుందో పరిశీలించగా..అది 2034లోనే జరగనుందని తెలిసింది. అంటే నిజంగానే కల్కి 2 రావడానికి 9 ఏళ్ల సమయం పడే అవకాశముందా.. అన్న డౌట్ జనంలో తలెత్తుతోంది.
ఇక ప్రభాస్ మాత్రం ఇప్పుడే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సలార్ 2 (ప్రశాంత్ నీల్), ది రాజా సాబ్ (మారుతి), స్పిరిట్ (సందీప్ రెడ్డి వంగా) వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇదీ చదవండి: అప్పటి వరకు శ్రీనర్‌కు జీరో ఫ్లైట్ కేన్సలేషన్ ఛార్జీలు.. విమానాయన సంస్థల ప్రకటన..
ఇదీ చదవండి: భయం.. బాధ.. పేరెంట్స్‌ను కోల్పోయి గుక్కపెట్టి ఏడ్చిన పిల్లల వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









