Prabhas Raja Saab Teaser: ప్రస్తుతం ప్రభాస్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నా కానీ.. ఆయన కల్ట్ అభిమానులు మాత్రం మారుతీ దర్శకత్వంలో రానున్న.. రాజా సాబ్ సినిమా పైన ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇందుకు ముఖ్య కారణం మళ్లీ డార్లింగ్ టైం లో ప్రభాస్ లుక్స్.. ఈ సినిమా పోస్టర్స్ లో కనిపించడం.
అందుకే ఈ సినిమా అప్డేట్ గురించి ఎన్నో రోజుల నుంచి తెగ ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ క్రమంలో ఈరోజు ఈ సినిమా టీజర్ అప్డేట్ విడుదల కాగా.. ప్రస్తుతం ఈ అప్డేట్ ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇక ఈ అప్డేట్ లో ప్రభాస్ మాస్ అవతారంలో కనిపించారు. నల్ల బనీన్ ఏసుకొని.. ఎర్ర క్లాత్ పట్టుకొని.. మంటల మధ్య నిలబడుకొని ఉండగా.. ఈ సినిమా టీజర్ జూన్ 16.. 10 : 52 కి విడుదలవుతుందని.. అలానే సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది అంటూ అప్డేట్ ఇచ్చేశారు సినిమా యూనిట్.
The dates of the REBEL FESTIVAL ?
⁰Teaser on JUNE 16th at 10:52 AM⁰Worldwide Grand Release - DECEMBER 5th#Prabhas #TheRajaSaab #TheRajaSaabOnDec5th pic.twitter.com/pakHM2hysr— The RajaSaab (@rajasaabmovie) June 3, 2025
ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్స్ చూస్తూ ఉంటే తప్పకుండా మరోసారి.. మిర్చి టైం లో ప్రభాస్ ఉన్న రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది.
ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్.. రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా జరుగుతుంది. ఇక పైన చెప్పినట్టు త్వరలోనే ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కూడా విడుదల కానుంది.
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









