Prabhas Status: సంథింగ్ స్పెషల్.. వైరల్ అవుతున్న ప్రభాస్ స్టేటస్..!

Prabhas Something Special: ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు హీరో ప్రభాస్. దాదాపు 6 సినిమాల పైగానే ప్రస్తుతం ప్రభాస్ చేతుల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని తెగ ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. కాగా ఇప్పుడు ప్రభాస్ షేర్ చేసిన ఒక స్టేటస్ తెగ వైరల్ అవుతుంది.

Written by - Vishnupriya | Last Updated : Apr 19, 2025, 03:42 PM IST
Prabhas Status: సంథింగ్ స్పెషల్.. వైరల్ అవుతున్న ప్రభాస్ స్టేటస్..!

Prabhas Instagram: పాన్ ఇండియా స్టార్‌గా ప్రబాస్ ఎదుగుతున్న తీరు చూస్తే తెలుగు అభిమానులకు ముచ్చట వేయక మానదు. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన ఆయన ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 

Add Zee News as a Preferred Source

అలాంటి సమయంలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా ప్రత్యేక ఆకర్షణగా మారింది. సీతారామం తర్వాత ఈ దర్శకుడు తీస్తున్న సినిమా కావడంతో దీనిపైన ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. 

ఇక సినిమాల పరంగానే కాకుండా కొన్నిసార్లు పర్సనల్ లైఫ్ ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు ప్రభాస్. ముఖ్యంగా తన పెళ్లి గురించి ఎక్కువగా తన అభిమానులు ఎదురు చూస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ ..వెయిటింగ్ ఫర్ సంథింగ్ స్పెషల్ అని స్టేటస్ పెట్టగానే అందరూ ఇదేం తప్ప అని ఎలా ఆనంద పడిపోయి చూశాడు. 

Prabhas Viral Post: అయితే ఆ పోస్ట్ వేసింది ప్రభాస్ మరెవరికో కాదు తన తదుపరి సినిమా దర్శకుడికి. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శకుడు హను రాఘవపూడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోస్ట్ వేశారు. ‘మీతో కలిసి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టులో భాగం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. వెయిటింగ్ ఫర్ సంథింగ్ స్పెషల్,’ అంటూ హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నారు ప్రబాస్. 

ఫౌజీ చిత్రం పీరియడ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో ప్రబాస్ రొటీన్ యాక్షన్ హీరో గా  కాకుండా.. ఒక మిలటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. హను దర్శకత్వంలో విజువల్స్, నేరేషన్, ఎమోషన్ మేళవింపుగా ఉండే ఈ చిత్రం, మరోసారి ప్రబాస్ అభిమానులను ఉర్రూతలూగించనుంది అని వినికిడి.

ఫౌజీ తర్వాత ప్రబాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రానున్న స్పిరిట్, మారుతీ దర్శకత్వంలో రానున్న ద రాజా సాబ్,‌ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సలార్ 2, నాగ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ..కాల్కి 2 వంటి ప్రాజెక్ట్స్‌లో నటించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రబాస్ ప్రస్తుతం ఇటలీలో సెలవులు ఆస్వాదిస్తున్నారట. ఒక నెల విరామం తీసుకుని మళ్లీ షూటింగ్‌లకు హాజరయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News