)
Prabhas Spirit Look Leak: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో 'కల్కి 2898 AD సీక్వెల్', 'ఫౌజీ', 'రాజా సాబ్' సినిమాలు ఉండగా.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రం కూడా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోల్డ్ డైరెక్టర్ సందీప్ పై భారీ అంచనాలు ఉండగా..ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండడం వల్ల ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్‌కు ఓ షాకింగ్ న్యూస్ కంగారు పెడుతుంది.
'స్పిరిట్' సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమవగా.. ఇప్పుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం ప్రభాస్ కొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నారని సమాచారం. అందుకే మొన్న సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాల్లోనూ చిరంజీవి, హీరోయిన్ త్రిప్తి దిమ్రి తప్పా ప్రభాస్ ఎక్కడా కనిపించలేదు. కానీ, చిరంజీవితో ప్రభాస్ కరచాలనం చేసిన ఫొటో మాత్రం రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ క్రమంలో ప్రభాస్ లుక్‌ను బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
'స్పిరిట్' సినిమాలో సరికొత్త లుక్ కోసం డార్లింగ్ ప్రభాస్ ఓ డేరింగ్ స్టెప్ తీసుకోనున్నారట. ఈ లుక్ బయటకు రాకుండా ప్రభాస్ దాదాపుగా 6 నెలలు బయటకు కనిపించకూడదని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలో ఎలాంటి పబ్లిక్ కార్యక్రమాలు ప్రీరిలీజ్ ఈవెంట్స్, ఇతర ప్రైవేట్ వేడుకల్లో కనిపించకూడని డిసైట్ అయినట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన డార్లింగ్ ప్రభాస్ అభిమానులు తీవ్రంగా ఆశ్చర్యపోతున్నారు. కానీ, పాత్ర గురించి గోప్యంగా ఉంచేందుకు చిత్ర యూనిట్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గత సినిమాలను గమనిస్తే.. ఆయన తన హీరోలను డిఫరెంట్ లుక్‌లో చూపించారు. 'అర్జున్ రెడ్డి' నుంచి 'యానిమల్' వరకు రగ్గుడ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్‌ను పోలీస్ పాత్రలో ఏ విధంగా చూపిస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విధంగా 'బాహుబలి' చిత్రీకరణ సమయంలోనూ ప్రభాస్ బయటకు రాకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. ఇప్పుడదే విధంగా 'స్పిరిట్' సినిమా కోసం ఆ సాహసం చేస్తున్నారట.
ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల్లో 'ఫౌజీ' చిత్రీకరణ జరుగుతుండగా.. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజా సాబ్' చిత్రీకరణ పూర్తయ్యి.. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో 'స్పిరిట్' లుక్‌లో ప్రభాస్ ఎలా బయటకు వస్తాడని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన 'రాజా సాబ్' చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ వచ్చే ఏడాదిలో 'కల్కి' సీక్వెల్ షూటింగ్‌లోనూ పాల్గొంటారని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook