Prabhas: కృష్ణంరాజు క‌ల‌ను నెర‌వేర్చ‌బోతున్న ప్ర‌భాస్..ఆ పని కోసం ఏకంగా అన్నీ కోట్లు..!

Prabhas to fulfill Krishnam Raju dream: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. తన దాతృత్వంతో మరోసారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన పెద్దనాన్న, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు కలను నెరవేర్చే లక్ష్యంతో పేదల కోసం ఓ భారీ హాస్పిటల్‌ నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి స్వయంగా వెల్లడించారు.  

Written by - Vishnupriya | Last Updated : Apr 3, 2025, 03:05 PM IST
Prabhas: కృష్ణంరాజు క‌ల‌ను నెర‌వేర్చ‌బోతున్న ప్ర‌భాస్..ఆ పని కోసం ఏకంగా అన్నీ కోట్లు..!

Prabhas charity: ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు..మొదటి నుంచి కూడా ఎంతో దాన గుణం ఉండేది. ఆప్తలో గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది మధుమేహం లాంటి తీవ్ర సమస్యలు ఎదురుకోవడం చూసి.. కృష్ణంరాజు పేదల కోసం వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. హాస్పిటల్‌ ఏర్పాటు చేయాలని భావించారు. ఆయన అకాల మరణం కారణంగా ఆ కల నెరవేరలేదు. కానీ ఇప్పుడు ప్రభాస్‌ ఆ బాధ్యతను స్వీకరించారు.  

Add Zee News as a Preferred Source

Prabhas hospital: యూకే ఇండియా ఫౌండేషన్‌ సహకారంతో కృష్ణంరాజు అభిమాన వైద్యుడు డాక్టర్‌ వేణు కవతప్‌ నేతృత్వంలో 20 మంది అపోలో వైద్యులు ఇప్పటికే భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ సేవలను మరింత విస్తరించేందుకు.. ప్రభాస్‌ మద్దతుతో శ్యామలాదేవి హాస్పిటల్‌ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.  

ప్రభాస్‌ గతంలోనూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనాకాలంలో రూ. 4.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 3 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు అందజేశారు. సినీ కళాకారుల కోసం చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ప్రతి ఏడాది 100 మంది విద్యార్థులకు పాఠశాల ఫీజులు, పుస్తకాలు, అవసరమైన సదుపాయాలు అందిస్తున్నారు.  

Prabhas donation: త్వరలో ప్రారంభం కానున్న ఈ హాస్పిటల్‌ కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారంట .అంతేకాదు దీని ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందించనున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే రోగులకు ఇది వరంగా మారనుందంట. కృష్ణంరాజు ఆశయం కోసం ప్రభాస్‌ ముందుకొచ్చి సేవా కార్యక్రమాలకు సహకరిస్తుండడం అభిమానులను ఆనందపరిచే విషయం. ప్రస్తుతం ప్రభాస్‌ సలార్‌, రాజాసాబ్‌, కల్కి 2898 ఏ.డి వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.

Read more: BRS KTR Video: బిడ్డా.. రేవంత్ నువ్వు తగ్గాల్సిందే..!.. హెచ్‌సీయూ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News