తెలుగు టీవీ యాంకర్స్ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జోడిగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.’. ఈ సినిమా టైటిల్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి చిత్రం టైటిల్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పవన్ ఫ్యాన్స్ అటెన్షన్ గురి చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
బైరిలంక అనే గ్రామంలో ఓ తరం మొత్తంలో ఆడపిల్లలు పుట్టరు. దీంతో ఆ ఊరిలో కరువు తాండవం చేస్తోంది. ఈ సమయంలోనే ఆ ఊర్లో ఒక ఆడపిల్ల పుట్టడంతో ఊర్లో వర్షాలు పడి ఊరు సుభిక్షంగా ఉంటుంది. దీంతో రాజ కుమారి (దీపికా పిల్లి) ఊరి దాటకుండా ఆ ఊరి వాళ్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు. అంతేకాదు ఈ ఊర్లో ఉన్న మగాళ్లనే పెళ్లి చేసుకోవాలని ఆ ఊరు పెద్ద శాసిస్తాడు. అంతేకాదు ఎవరితై రాజకుమారిని పెళ్లి చేసుకుంటారో వారికీ తన ఆస్తిని ఇస్తానని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఊర్లో స్వచ్ఛ్ భారత్ పథకం కింద బాత్రూమ్ కట్టడానికి ఈ ఊరికి ఇంజనీర్ కృష్ణ (ప్రదీప్) తన టీమ్ మెంబర్స్ తో కలిసి వస్తాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేదే మిగిలిన స్టోరీ.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
యాంకర్ గా స్మాల్ స్క్రీన్ తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా సినిమాలు చేస్తాడు. పవన్ కళ్యాన్ తొలి సినిమా టైటిల్ కావడంతో ఈ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేశాడు. ఒక ఊళ్లో ఒక అమ్మాయి ఉండటం ఆమె ఆ ఊరి వాళ్లలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఆ ఊరి పెద్ద తీర్మానం చేయడం. దీంతో ఊరి బయట నుంచి వచ్చిన వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమించడం అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కథ ను మలిచిన విధానం బాగుంది. మధ్యలో సత్య కామెడీ బాగానే పేలింది. బయట వాళ్లకు రాజకుమారి కనపడకుండా చేయడం వంటివ చూస్తుంటే.. చంటి సినిమా కాస్త గుర్తుకు వస్తోంది. ఆ పాయింట్ ను బేస్ చేసుకొని సరికొత్తగా ఈ కథను రాసుకున్నట్టు తెలుస్తుంది.
ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నా.. క్లైమాక్స్ లో ఏం చేయాలో తెలియక దర్శకుడు చేతులెత్తేసాడు. లేకపోతే ఈ సినిమా మరో లెవల్లో ఉండేది. ఉన్నంతలో ఈ సినిమా సబ్జెక్ట్ ను ఎంటర్టైనింగ్ గా రాసుకున్నాడు దర్శకుడు. అందులో దర్శకుడు శైలి కనిపిస్తోంది. కాస్త ఇవివి, అనిల్ రావిపూడి తరహాలో కామెడీని ట్రై చేసాడు దర్శకుడు. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ సెకండాఫ్ లో తన కత్తెరకు పదను పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
ప్రదీప్ మాచిరాజు చిన్న తెరపై యాంకర్ గా అందరికి సుపరిచితమే. కానీ వెండితెరపై తనదైన శైలిలో మెప్పించాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్ చేశాడు. దీపికా పిల్లి తన గ్లామర్ తో అలరించింది. ఈ సినిమాకు సత్య కామెడీ పెద్ద ఎస్సెట్. తన టీమ్ మెంబర్స్ తో చేసే హంగామా నవ్వులు తెప్పిస్తాయి. మిగిలిన నటీనటుల తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. అక్కడక్కడ ఛమక్కు అనిపించే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’..
రేటింగ్: 2.75/5
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









