Prakash Raj: ఏం సినిమా అనుకున్నావా..?.. పవన్ కళ్యాణ్‌పై మళ్లీ సెటైర్‌లు వేసిన ప్రకాష్ రాజ్.. స్టోరీ ఏంటంటే..?

Prakash raj VS Pawan Kalyan: ప్రకాష్ రాజ్ మళ్లీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.  రాజకీయాల్లో రాకముందు ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పారని, ఇప్పుడు మాత్రం ప్రజల సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకొవడంలేదని మండిపడ్డారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 3, 2025, 03:43 PM IST
  • పవన్ పై మళ్లీ మండిపడిన ప్రకాష్ రాజ్..
  • లడ్డు వివాదంపై మళ్లీ సెటైర్ లు..
Prakash Raj: ఏం సినిమా అనుకున్నావా..?.. పవన్ కళ్యాణ్‌పై మళ్లీ సెటైర్‌లు వేసిన ప్రకాష్ రాజ్.. స్టోరీ ఏంటంటే..?

Prakash raj comments on pawan kalyan: నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తనదైన స్టైల్ లో మండిపడ్డారు. ఏపీలో గతంలో జనసేన పార్టీలో పవన్ కళ్యాన్  ఎన్నికల వేళ ప్రజా సమస్యలపై గళమెత్తారన్నారు. అన్నింటికి కూటమి అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కారమౌతాయన్నట్లు పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచికొట్టారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం.. అవేమీ పట్టించుకొకుండా.. పాలన సాగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో తిరుమల లడ్డు వివాదంపై దేశ వ్యాప్తంగా సనాతన ధర్మంఅంటూ అనేక కీలక వ్యాఖ్యలు చేశారు.

Add Zee News as a Preferred Source

సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను సైతం ఇస్తానని పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రకాశ్ రాజ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాతీయ అవార్డులు, రాజకీయాలు, వివాదాస్పద అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అదే విధంగా తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాక ముందు ప్రజా సమస్యల గురించి చురుకుగా మాట్లాడారని, కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం.. వాటిపైన దృష్టి పెట్టడం లేదని ప్రకాశ్‌ రాజ్‌ కూటమి పాలనను విమర్శించారు.

అదే విధంగా.. లడ్డు వివాదంపై గతంలో చాలా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాన్ .. ఆ తర్వాత మరల దాన్నిపట్టించుకోవడంలేదన్నారు. అసలు.. లడ్డులో నిజంగా కల్తీ జరిగితే.. దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకొవాలన్నారు. తిరుమల లడ్డు వివాదం చాలా సున్నితమైన అంశమని.. అందుకే దీనిపైన  మాట్లాడేటప్పుడు సరైన విధంగా స్పందించాలన్నారు. అయితే.. లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ పై  ప్రకాష్ రాజ్ సెటైర్లు వేయడం ఇది తొలిసారి కాదు.. గతంలో కూడా పలుమార్లు పవన్ కళ్యాణ్ పై , ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా జస్ట్  ఆస్కింగ్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.

గతంలో పవిత్రమైన తిరుమల లడ్డులో జంతువులు ఎముకల నుంచి తయారు చేసిన కల్తీపదార్థాలతో తయారు చేశారని ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. లడ్డు వివాదం కాస్త రెండు తెలుగురాష్ట్రాలలో పెద్ద దుమారంగా మారింది. ఏకంగా సుప్రీంకోర్టు వరకు కూడా లడ్డు వివాదం వెళ్లింది.

కోట్లాది మంది భక్తుల మనోభావాలకు చెందిన అంశం కావడంతో దీనిపైన ఏపీ సర్కారు ఆచీతూచీ వ్యవహరిస్తుంది. మరోవైపు కూటమి ప్రభుత్వం.. టీటీడీపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. తిరుమలలో భక్తులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొవాలని టీటీడీ ఆదేశించింది. అదేవిధంగా.. శ్రీవారి కైంకర్యాలలో కూడా ఎక్కడ కూడా లోపాలు రాకుండా చూసుకొవాలని టీటీడీకి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News