Predator: Badlands: ఈ నెల 7న ‘ప్రిడేటర్ బ్యాండ్ లాండ్స్’ సినిమా విడుదలైంది. ఇక సామాజిక మాధ్యమాల్లో ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పటి నుంచి నెటిజన్లు “ఇది మన స్టైల్ చిత్రం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. యాక్షన్ బ్లాస్టింగ్‌గా, విజువల్స్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉన్నాయనే కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో ప్రతి సీన్ థ్రిల్లింగ్ ఉన్నాయనే ఫీలింగ్ కలిగేలా ఈ చిత్రం ఉందనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంతేకాదు సినిమా కూడా ఓ రేంజ్ లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జెన్నా గ్రహం మీద ప్రెడేటర్ డెక్ చేసే ఫైట్స్, క్రియేటివ్ స్టైల్‌లో డిజైన్ చేసిన వార్స్ సీన్స్ – అన్నీ థియేటర్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
ప్రిడేటర్ బ్యాడ్ లాండ్స్ లో యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్ కూడా అంతే బలంగా ఉంది. డెక్ తన తండ్రి అప్రూవల్ కోసం, తన తమ్ముడు క్వేయ్ కోసం చేసే ఫైట్ – ఇది కేవలం హంట్ కాదు, ఫ్యామిలీ పరువు కోసం చేసే పోరాటం. మొత్తంగా హాలీవుడ్ సినిమాలో కుటుంబ నేపథ్యం రివెంజ్ ఎలిమెంట్, భావోద్వేగానికి గురి చేసే డైలాగులు మన ప్రేక్షకులకు పక్కా కనెక్ట్ అవుతున్నారు. ఈ ఎమోషనల్ డెప్త్ సినిమాకి మసాలా బేస్‌గా నిలుస్తుందనే చెప్పాలి.
డెక్‌కి సపోర్ట్‌గా ఉన్న టాకేటివ్ సింథెటిక్ థియా, చిన్న ఏలియన్ బడ్‌తో కలసి వచ్చే కామెడీ ట్రాక్ మూవీ టోన్‌ని లైట్‌గా ఉంచుతోంది. ఈ త్రయంలోని కెమిస్ట్రీ సినిమాకి కొత్త ఎనర్జీని తీసుకొచ్చింది. యాక్షన్, ఎమోషన్, హ్యూమర్ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో ఉన్నాయి. ఈ మసాలలు అన్ని కలగలిపిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు “పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్” అని చెప్పడమే వసూళ్లు కూడా కురిపిస్తున్నారు. మొత్తానికి ‘ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్’ సైన్స్-ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఇండియన్ మసాలా సౌల్‌ని కలిపిన రేర్ మాస్టర్‌బ్లెండ్‌గా నిలుస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
Also Read: చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









