Premaku Jai Releases Date: ప్రేక్షకులకు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలంటే ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అద్భుతమైన కథా పరిణామాలు, సహజమైన భావోద్వేగాలు, జీవితాన్ని పోలి ఉండే పాత్రల నేపథ్యంలో రూపొందే సినిమాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతుంటాయి. అలాంటి సినిమాల జాబితాలోకి కొత్తగా చేరింది 'ప్రేమకు జై'. ఈ చిత్రం ఈ నెల 11న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.
ఈ చిత్రం ఓ గ్రామీణ ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకొని, అక్కడ నిజంగా జరిగిన ఓ ప్రేమకథను ఆధారంగా చేసుకొని రూపొందించబడింది. అనిల్ బురగాని, జ్వలిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అనసూర్య నిర్మాతగా వ్యవహరించగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఈ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సోషల్ మీడియాలో మంచి స్పందనను తెచ్చుకున్నాయి. వీటిని చూసిన ప్రేక్షకులు సినిమాలో ఏదో కొత్తదనం ఉందనే భావనతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ప్రేమకు జై' సినిమా ప్రేమ, బాధ, సంఘర్షణలు, గెలుపు వంటి ఎమోషన్ల మేళవింపుగా ఉండబోతుందని చిత్రబృందం చెబుతోంది.
దర్శకుడు మల్లం శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపించేందుకు మా టీమ్ చాలా శ్రమించింది. అసలైన కథను బాగా రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రూపొందించాం. అనిల్ బురగాని, జ్వలిత తమ పాత్రల్లో ఎంతో నైపుణ్యంతో నటించారు. నిర్మాత అనసూర్య ఏ విషయంలోనూ రాజీపడకుండా క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రేక్షకుల అభిమానం మా సినిమాకు ఆశీస్సులా ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని తెలిపారు.
ఇందులో అనిల్ బురగాని, జ్వలిత లవ్ ట్రాక్ పక్కా హార్ట్ టచింగ్‌గా ఉండబోతుందట. దుబ్బాక భాస్కర్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్ ఉరుకుందా రెడ్డి అందించిన విజువల్స్ సినిమాలోని గ్రామీణ వాతావరణాన్ని నిజంగా మన కళ్ల ముందు పెట్టినట్టుగా ఉంటాయంటున్నారు. చైతు అందించిన సంగీతం ఇప్పటికే ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా టెక్నికల్ టీమ్ లో ఎడిటర్ సామ్రాట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం రాజేష్, సహ నిర్మాత మైలారం రాజు వంటి వారు ఉన్నారు. కథ మరియు దర్శకత్వ బాధ్యతలు శ్రీనివాస్ మల్లం తీసుకున్నారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రంగా ‘ప్రేమకు జై’ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని, ఈ సినిమా ద్వారా స్నేహితులు, ప్రేమికులు నిజమైన ప్రేమ అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది. ఏప్రిల్ 11న థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









