Prithviraj Sukumaran Kumbha: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి శుక్రవారం తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాగ్నమ్ ఓపస్ 'గ్లోబ్ ట్రోటర్'లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. విలన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ చిత్రంలో కుంభ అనే పాత్రలో పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పోస్టు చేస్తూ రాజమౌళి ఈ విధంగా రాసుకొచ్చారు. "పృథ్వీతో మొదటి షాట్‌ను చిత్రీకరించిన తర్వాత, నేను అతని వద్దకు వెళ్లి మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో ఒకరు అని చెప్పాను. ఈ దుష్ట, క్రూరమైన, శక్తివంతమైన విరోధి కుంభకు ప్రాణం పోసుకోవడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉంది. తన కుర్చీలో జారిపోయినందుకు పృథ్వీకి ధన్యవాదాలు." అని ఎస్ఎస్ రాజమౌళి పోస్ట్ చేశారు.
అందుకు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. "ఇది నాకు దక్కిన గౌరవం! ఈ విచిత్రమైన రైడ్ మిగిలిన భాగం కోసం ఎదురు చూస్తున్నాను" అని పృథ్వీరాజ్ అన్నారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ ఓ ప్రత్యేకమైన విలన్‌గా కనిపిస్తున్నారు. రోబోటిక్ చేతులు కాళ్లు పడిపోయిన వ్యక్తిగా వీల్ ఛైర్‌పై కూర్చున్నట్లు కనిపిస్తున్నారు నటుడు పృథ్వీరాజ్.
వీరితో పాటు హీరో మహేష్ బాబు, హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా పృథ్వీరాజ్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. విలన్ పాత్రతో పాటు మరికొన్ని సర్‌ప్రైజ్‌లు విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి చెప్పకొచ్చారు. నవంబరు 15వ తేదీన హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో 'గ్లోబ్ ట్రోటర్'కు సంబంధించిన స్పెషల్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ సహా సినిమా టైటిల్‌ను రివీల్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈవెంట్‌కు సంబంధించిన కార్యక్రమాలు చకచక జరుగుతున్నాయి. 100 అడుగుల ఎల్‌ఈడీ స్క్రీన్‌ను రెడీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









