)
Priyanka Chopra Dance With Karthikeya: సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిలై సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి, హీరో మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమాలో నటిస్తోంది. ప్రియాంక తెలుగు సినిమాని ఒప్పుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ సినిమాను హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తుండటంతో పాటు.. రెమ్యునరేషన్ కూడా భారీగా ఇవ్వడంతో ప్రియాంక ఈ మూవీ చేయడానికి ఓకే చెప్పింది.
ఇక ప్రియాంక చోప్రా ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుండి.. మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వకపోయినా షూట్ కి వెళ్లిన ప్రతిసారి అక్కడ లొకేషన్స్ లో ఫోటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంది. ఇటీవల వారణాసి సినిమా ఈవెంట్లో కూడా ప్రియాంక చోప్రా అటెండై సందడి చేసింది. ఇందులో నటిస్తున్నప్పటి నుండి హీరో మహేష్ బాబు ఫ్యామిలీ, డైరెక్టర్ రాజమౌళి ఫ్యామిలీతో ప్రియాంకకు మంచి అనుబంధం ఏర్పడింది.
తాజాగా రాజమౌళి కొడుకు కార్తికేయకు బర్త్ డే విషెస్ తెలుపుతూ తన ఇన్‌స్టా స్టోరీలో స్పెషల్ పోస్టులు పెట్టింది ప్రియాంక. కార్తికేయతో దిగిన ఫోటోని షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే కార్తికేయతో కలిసి చేసిన ఓ డ్యాన్స్ వీడియోని కూడా పోస్ట్ చేసింది ప్రియాంక. ఈ డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేస్తూ.. టేక్ ఇట్ ఈజీ మై ఫ్రెండ్. సైలెంట్ గా అన్ని పనులు చేసే వ్యక్తి హ్యాపీ బర్త్ డే కార్తికేయ. ఈ సినిమా సమయంలో నీతో డ్యాన్స్ చేయడం సంతోషంగా ఉంది అని పోస్ట్ చేసింది.
రాజమౌళి కొడుకు బర్త్ డేకి ఇలా తనతో డ్యాన్స్ చేసిన స్పెషల్ వీడియో షేర్ చేసి విషెస్ చెప్పడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. రాజమౌళి కొడుకు కార్తికేయ వారణాసి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే.. ప్రమోషన్స్ అన్ని చూసుకుంటున్నాడు. ప్రియాంక చోప్రా షేర్ చేసిన డ్యాన్స్ వీడియో మీరు కూడా చూసేయండి.
It looks like the cast and crew of #Varanasi have a truly organic connection, unlike the artificial "brotherhood" that was staged for the last movie 🙌#MaheshBabu #PriyankaChopra #SSKpic.twitter.com/Dk23OkmCOI
— TFI Movie Buzz (@TFIMovieBuzz) November 22, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి