)
Proddatur Dussehra Documentary: దసరా ఫెస్టివల్ తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా జరుపుకుంటారు. అయితే ప్రొద్దుటూరులో ఇంకా స్పెషల్‌గా నిర్వహిస్తారు. ఎందుకు ఇక్కడ స్పెషల్ అని తెలుసుకోవాలంటే మా డాక్యుమెంటరీ చూడాల్సిందేనంటున్నారు ‘ప్రొద్దుటూరు దసరా’ మేకర్స్. మురళీ కృష్ణ తుమ్మ దర్శకత్వం వహించగా.. ప్రేమ్ కుమార్ వలపల ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. శుక్రవారం స్పెషల్ షో ప్రదర్శించగా.. కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల ముఖ్య అతిథులుగా హాజరై వీక్షించారు.
అనంతరం దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. ఓ సరైన డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్ ఉంటుందని చెప్పారు. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్‌గా ఉండదని భావిస్తారని.. కానీ ఈ ప్రొద్దుటూరు దసరా ఎంతో ఎంగేజింగ్‌గా ఉందని మెచ్చుకున్నారు. అద్భుతంగా అనిపించిందని.. డాక్యుమెంటరీ అంటే ఇలానే తీయాలనే రూల్స్ బద్ధలు కొట్టారని అన్నారు. యశ్వంత్ నాగ్ మంచి మ్యూజిక్ అందించారని.. ఆర్ఆర్, పాట విన్నా కూడా గూస్ బంప్స్ వచ్చాయని చెప్పారు.
యాక్టర్ మహేష్ విట్టా మాట్లాడుతూ .. ప్రొద్దుటూరు దసరా డాక్యుమెంటరీని అందరి ముందుకు తీసుకువచ్చిన ప్రేమ్‌కు థ్యాంక్స్ చెప్పారు. తమ ఊర్లో జరిగే దసరా గురించి అందరికీ చెబుతుంటానని.. 10 రోజులపాటు పండుగ అదిరిపోతుందని అన్నారు. అయితే ఈ డాక్యుమెంటరీలో ఇంకా బాగా చూపించారని చెప్పారు. 10 టెంపుల్స్‌లో దసరా గొప్పగా జరుగుతుందని.. 11వ రోజు మాత్రం వాహనాలు కూడా వచ్చే స్థలం ఉండదని తెలిపారు. దర్శకుడు ఉదయ్ గుర్రాల మాట్లాడుతూ.. తాను కూడా డాక్యుమెంటరీలు తీసి ఇండస్ట్రీలోకి వచ్చానని.. నిజాలను దాచి పెట్టడం, భావి తరాలకు చూపెట్టడం డాక్యుమెంటరీని చెప్పారు. ప్రొద్దుటూరు దసరాని అక్కడి వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీశారని మెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దసరాని ప్రొద్దుటూరులో ఇంత గొప్పగా చేస్తారని తెలియదని చెప్పారు.
ప్రొడ్యూసర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. బాల్కనీ ఒరిజినల్స్‌ని మూడేళ్ల క్రితం మొదలుపెట్టానని చెప్పారు. ఇప్పటివరకు తమ ఏరియా అంటే వయలెన్స్ మాత్రమే ఉంటుందని అనుకుంటున్నారని.. ఇప్పుడు తమ మూలాల్లోని కథలను చూపిస్తానని తెలిపారు. యశ్వంత్ మ్యూజిక్, నిఖిల్ కెమెరా వర్క్ గొప్పగా వచ్చిందన్నారు. జయసింహా మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు దసరా డాక్యుమెంటరీలో అక్కడ జరిగే దృశ్యాలను చూపించామన్నారు. నిర్మాత ప్రేమ్ కుమార్ ఇలాంటి గొప్ప ప్రాజెక్టులెన్నో ఇంకా చేయాలని అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.