)
Proddatur Dussehra Documentary: కడప జిల్లా ప్రొద్దుటూరు అంటే బిజినెస్‌కు ఎంతో ఫేమస్. అంతకుమించి ఈ నగరం దసరా ఉత్సవాలకు కూడా ప్రసిద్ధి. రెండో మైసూర్‌కు పేరు తెచ్చుకున్న ప్రొద్దుటూరులో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడి దసరా ఉత్సవాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో 'ప్రొద్దుటూరు దసరా' పేరుతో ఓ డాక్యుమెంటరీ తెరకెక్కింది. మురళీ కృష్ణ తుమ్మ దర్శకత్వంలో రూపొందిన ఈ డాక్యుమెంటరీని ప్రేమ్ కుమార్ వలపల నిర్మించారు. అక్టోబర్ 31వ తేదీన థియేటర్స్‌లో సందడి చేసిన ఈ డాక్యుమెంటరీ.. వారం తరువాత ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్ వేదికగా నవంబర్ 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంది.
ప్రొద్దుటూరు దసరా డాక్యుమెంటరీ నిడివి దాదాపు 40 నిమిషాలపాటు ఉంటుంది. ఇందులో ప్రొద్దుటూరు దసరా ఎలా నిర్వహిస్తారు..? అక్కడ ఎందుకు అంత స్పెషల్..? అనేది చక్కగా చూపించారు. శరన్నవరాత్రులు ఉత్సవాలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. దాదాపు 150 సంవత్సరాలుగా ఇక్కడ దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా పట్టణంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ప్రజలు భారీగా తరలివచ్చి ఈ ఉత్సవాలను వీక్షిస్తారు.
ఈ డాక్యుమెంటరీని వీక్షించిన ప్రముఖులు ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించారు. ప్రొద్దుటూరు నగరం ఎంతో ఘనమైన వారసత్వాన్ని అందించిందని.. దసరా ఉత్సవాలను కళ్లకు కట్టినట్లు డాక్యుమెంటరీలో చూపించారని అభినందించారు. మురళీ కృష్ణ తుమ్మ తన మేకింగ్‌తో కట్టిపడేశారని మెచ్చుకున్నారు. ఈ డాక్యుమెంటరీ నిర్మాత ప్రేమ్ కుమార్ వలపల.. బాల్కనీ ఒరిజినల్ బ్యానర్‌పై మరిన్ని సినిమాలు, డాక్యుమెంటరీలు తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీని స్టార్ సర్కిల్స్ డిజిటల్స్ ప్రమోషన్స్ చేస్తుండగా.. కిలారి సుబ్బారావు పీఆర్వోగా వ్యవహరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook