Bunny Vas on Vijay: రష్మిక మందన్న కథానాయికగా.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ సినిమా హిట్ టాక్ తో పాటు విడుదలైన ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో నిన్న ఓ స్టార్ హోటల్ లో ఈ సినిమా విజయోత్సవ సభను నిర్వహించారు. దీనికి రష్మిక.. కాబోయే వాడు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ.. మాకు మాత్రం బంగారు కొండ అంటూ విజయ్ ను పొగడ్తల వర్షంలో ముంచెత్తాడు.
గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో నవంబర్ 7వ తేదీన ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం మంచి విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండతో పాటు పలువురు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక నిర్మాత బన్నీ వాస్ ఓ అడుగు ముందుకేస్తూ.. పొగుడుతూ తన స్పీచ్ మొదలుపెట్టారు. గీత ఆర్ట్స్ అంటే తన సొంత బ్యానర్ అనే ఫీల్ తో వచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకుగాను విజయ్ దేవరకొండకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ సందర్భంగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మిక గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో రష్మిక అద్భుతంగా నటించారని పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా మూవీ క్లైమాక్స్ లో చేసిన నటన పీక్స్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఎన్నో సినిమాలకు నిర్మాతగా అలాగే ఇతర వ్యవహారాలలో ఉన్న సీనియార్టీ ఉన్న బన్నీ వాస్ ఇలా ఒక చిత్ర స్పందన గురించి ముందుగానే ఒక అంచనా వేయడం అది నిజం కావడమనేది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక నిర్మాతగా ఆయనకు ఇలాంటివి ఎక్స్ పెక్ట్ చేయడం సహజమైన విషయం.
ప్రతి సినిమా వెనక కేవలం ఒక వ్యక్తి చేసే కష్టం కాదు. ఒక చిత్ర బృందం అంతా కలిసి ఒక సినిమాను ముందుకు తీసుకు వెళ్తుందన్నారు. కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి మాత్రం తన సర్వం ఈ చిత్రం కోసం అర్పిస్తారన్నారు. అలా ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ రవీంద్ర ఎంతో బలంగా నిలబడి ఈ మూవీని ముందుకు తీసుకుని వెళ్లారన్నారు. మీరు నమ్మిన కథను ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని చెప్పారు. మీ నిజాయితీనీ, మిమ్మల్ని నమ్మి నిర్మాతలే కాక చిత్ర బృందం అంతా మీ వెంట వచ్చారని దర్శకుడు రాహుల్ రవీంద్ర గురించి చెప్పుకొచ్చారు.
ఈ సమయంలో ఎంతోమంది యువతకు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఈ చిత్రంలోని దీక్షిత్ పాత్రను ఎంతోమంది ప్రస్తుతం బయట చర్చించుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు.సినిమాలో అతని పాత్ర పండింది. ఈ సినిమాలోని దీక్షిత్ పాత్రకు కనెక్ట్ అయిన ప్రేక్షకులు బయట దీక్షిత్ ను ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. దీక్షిత్ ఈ పాత్రలో అంత బాగా నటించిన విషయాన్ని ప్రస్తావించారు. .
ఈ సినిమాను నేను నా భార్యతో కలిసి చూసాను. తను సినిమా చూసిన తర్వాత నా భుజంపై చేయి వేసి బయటకు తీసుకువెళ్లారు. అంటే నేను చాలా మంచి భర్తను అని నాకు అర్థమైంది. ఆ విషయం నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ చిత్రాన్ని ముందుకు వెళ్లాలని చిత్ర బృందం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తన స్పీచ్ ను ముగించారు.
Read more: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా ఉన్న రాజా సాబ్ భవనం..!
Read more: ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..! అస్సెట్స్ విషయంలో నిజంగానే బాహుబలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









