Prominent politician in movies:
సాధారణంగా సినిమా రంగానికి, రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా మంది సినిమాలలో ఒక స్థానానికి చేరుకున్న తర్వాత రాజకీయాలలో సత్తాచాటిన విషయం తెలిసిందే. మరి కొంతమంది రాజకీయాలలో ఉంటూనే కూడా తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ జాబితాలోకి తాను కూడా చేరిపోతాను అంటూ ముందుకు వచ్చారు ప్రముఖ రాజకీయ నాయకుడు జగ్గారెడ్డి.
త్వరలోనే సినిమాల్లోకి వస్తానని చెప్పిన ఈయన.. సినిమాపై తనకున్న ఆసక్తిని కనబరిచారు. ఇక అందులో భాగంగానే జగ్గారెడ్డి మాట్లాడుతూ..నాకు ఒక సినిమాలో అవకాశం వచ్చింది. త్వరలోనే నేను సినిమాల్లోకి రాబోతున్నాను. ఒక ప్యూర్ లవ్ స్టోరీ లో ప్రత్యేకమైన రోల్ నాకు కల్పించారు. ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్ లో నేను నటిస్తున్నాను.
సినిమాల్లోకి వచ్చినంత మాత్రాన రాజకీయాలకు దూరం అవుతానని అనుకోకండి. అటు సినిమాల్లోనూ ఉంటాను. ఇటు రాజకీయాల్లోనూ ఉంటాను. రాజకీయాల్లో నన్ను ఎవరు తొక్క లేరు. నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో సినిమాలో మీరే చూస్తారు. ఈ ఉగాదికి సినిమా కథ విని వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తాను.
సీఎం , పీసీసీకి చెప్పి సమయం తీసుకుని ఒక సంవత్సరం పాటు సినిమాలో నటిస్తాను. ఈ సినిమాలో మాఫియాను ఎదిరించి, ప్రేమ పెళ్లి చేసే నాయకుడి పాత్ర పోషిస్తున్నాను. ఇది పాన్ ఇండియా చిత్రంగా దేశవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నాము. తెలుగు , హిందీ భాషల్లో ఈ సినిమా ఉంటుంది అంటూ జగ్గారెడ్డి తెలిపారు. అంతేకాదు రౌద్రంతో కూడిన ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.
ప్రస్తుతం జగ్గారెడ్డి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక సినిమాల్లో రియల్ క్యారెక్టర్ చూస్తారంటూ చెప్పిన ఆయన.. ఈ సినిమాతో ఎలా తన సక్సెస్ ను ఆరంభిస్తారో చూడాలి. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ ఆయన సినిమాలలో కొనసాగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









