ఎన్టీఆర్‌కు జంటగా పూజ హెగ్డే ?

Last Updated : Nov 3, 2017, 06:53 PM IST
ఎన్టీఆర్‌కు జంటగా పూజ హెగ్డే  ?

సార్ట్ దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో జూ. ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే… మోస్ట్ ఎవైటింగ్ కాంబినేషన్ మూవీ గా తెరక్కెక్కుతున్న ఈ సినిమాకు హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు మేకర్స్.జనవరి లేదా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.అయితే ఇటివలే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్, మెహ్రీన్ పేర్లు వినిపించగా ఇప్పుడు ఈ సినిమాకు పూజ హెగ్డే ని హీరోయిన్ గా ఫైనల్ చేయనున్నారని తెలుస్తుంది. లేటెస్ట్ గా బన్నీ సరసన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలో నటిస్తుంది.. ఎన్టీఆర్ సరసన ఓ ఫ్రెష్ కాంబినేషన్ కోసం చూస్తున్న త్రివిక్రమ్ అండ్ టీం ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని ఫిక్స్ చేసే ప్రాసెస్ లో ఉన్నారని సమాచారం. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Trending News