Ra Raja Release Date : శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా ‘రా రాజా’ ప్రేక్షకులను కొత్త అనుభూతికి లోను చేయబోతోంది. దర్శకుడు బి. శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించారు. ముఖ్యంగా, ప్రధాన పాత్రధారుల మొహాలు చూపించకుండా కేవలం కథనాన్ని నమ్ముకుని ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. మార్చి 7న విడుదల కాబోతున్న ఈ సినిమా విజయవంతం కావాలని చిత్రబృందం ఆకాంక్షిస్తోంది.
మీడియా సమావేశంలో దర్శకుడు బి. శివ ప్రసాద్ మాట్లాడుతూ – "నిర్మాతగా ఉన్నప్పుడు నా మైండ్‌లో వచ్చిన ఒక కొత్త ఆలోచన ఈ సినిమా రూపంలో బయటపడింది. దాన్ని కథగా మలచి, నా అనుభవాన్ని ఉపయోగించి చిత్రాన్ని తెరకెక్కించాను. ఇప్పటివరకు ఈ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ మెచ్చుకున్నారు. మార్చి 7న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నాం. అందరూ చూస్తూ, ఆదరిస్తూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.
సినిమాకు సంగీతం అందించిన శేఖర్ చంద్ర మాట్లాడుతూ – "‘రా రాజా’ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించే అవకాశం దక్కింది. దర్శకుడు శివ ప్రసాద్ గారిని నిర్మాతగా పరిచయం ఉన్నప్పటికీ, కథను చెప్పిన విధానం చూస్తే నిజమైన దర్శకుడిగా కనిపించారు. కథ బాగా అనిపించి, దానికి తగ్గ సంగీతాన్ని అందించాను. ప్రేక్షకులంతా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు.
సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ శ్రీ వాత్సవ్ మాట్లాడుతూ – "ఈ సినిమాలో పని చేయడం నాకు గర్వకారణం. దర్శకుడు, నిర్మాతల సహకారంతో ఈ సినిమా విజువల్‌గా ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆస్వాదించి విజయం వైపు నడిపించాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.
‘రా రాజా’ సినిమాను మార్చి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కొత్త తరహా కథనాన్ని ఆస్వాదించాలనుకునే వారు ఈ సినిమాను తప్పక చూడాలి. ఈ ప్రయోగాత్మక సినిమాను విజయవంతం చేసేందుకు ప్రేక్షకులు సహకరించాలని చిత్రయూనిట్ కోరుకుంటోంది.
Also Read: Samantha: 'మాజీ భర్త నాగ చైతన్యతో చేసిన ప్రతి సీన్ నాకు గుర్తుంది': హీరోయిన్ సమంత
Also Read: APPSC Age Limit: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. ఏపీపీఎస్సీ వయో పరిమితి పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









