Raakasa First Glimpse: ఆకట్టుకుంటున్న సంగీత్ శోభన్ ‘రాకాస’ ఫస్ట్ గ్లింప్స్..

Raakasa First Glimpse: మెగా డాటర్ నిహారిక నటిగానే కాకుండా నిర్మాతగా సత్తా చాటుతుంది. తొలి ప్రయత్నంలోనే ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఇపుడు సంగీత్ శోభన్ హీరోగా ‘రాకాస’ మూవీ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 24, 2026, 12:00 AM IST
Raakasa First Glimpse: ఆకట్టుకుంటున్న సంగీత్ శోభన్ ‘రాకాస’ ఫస్ట్ గ్లింప్స్..

Raakasa First Glimpse Responce: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై  నిహారిక కొణిదెల‌, ఉమేష్ కుమార్ బ‌న్సాల్ నిర్మిస్తోన్న‌ చిత్రం ‘రాకాస’. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ గ్లింప్స్ లో ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి మెస్మరైజ్ చేశాడు.  

Add Zee News as a Preferred Source

అభిరుచి గల నిర్మాతగా సత్తా చాటుతున్న  నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపుని సాధించింది.  తాజాగా ఇపుడు జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక నిర్మిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం  ‘రాకాస’. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన యాక్టింగ్ తో యూత్ కు దగ్గరైన  యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంతో మొదటి సారి సోలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 3న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు.  ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ‘రాకాస’ గ్లింప్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. 

‘యుగయుగాలుగా ప్రతీ కథలో ఒక సమస్య.. ఆ సమస్యను ఛేదించడానికి ఓ వీరుడు పుడతాడు.. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు.. ఈ కథలో ఆ వీరుడు నేనే’ అంటూ ఓ రేంజ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తూ గ్లింప్స్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఆ తరువాత ఒక్కసారిగా అది కామెడీ, సెటైరికల్ టర్న్ ఇచ్చుకోవడం నవ్వు ఆగదు. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ తన కామెడీ టైమింగ్‌తో మళ్లీ మెప్పిస్తాడని, అందరినీ ఆకట్టుకుంటాడని ఈ గ్లింప్స్‌తోనే చెప్పేశాడు. 

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా కొత్త కథతోనే మరో ప్రయోగం చేస్తున్నట్టుగా ఈ గ్లింప్స్ ఉంది.  ఇక ఇందులో సంగీత్ శోభన్ తనలోని మరో కోణాన్ని చూపించాడు.  ఈ చిత్రానికి కామెడీనే ప్రధాన బలం అని ఈ గ్లింప్స్ చెబుతుంది. కామెడీతో పాటుగా ఓ కొత్త పాయింట్‌ను, కొత్తదనాన్ని చూపించేలా కనిపిస్తోంది. అనుదీప్ దేవ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో నయన్ సారిక, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి,ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌ అమ్మ, అనూప్ సింగ్ ఠాకూర్‌, ర‌మ‌ణ భార్గ‌వ్‌, వాసు ఇంటూరి, రోహిణి (బ‌జ‌ర్ద‌స్త్‌), రోహ‌న్ (నైంటీస్‌) త‌దిత‌రులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌, పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌  బ్యానర్స్ పై  నిహారిక కొణిదెల‌, ఉమేష్‌కుమార్ బన్సాల్‌  నిర్మిస్తున్నారు. క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ తో పాడు డైరెక్ట్ చేస్తున్నద మాన‌స శ‌ర్మ. ఈ  చిత్రానికి  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  మ‌న్యం ర‌మేష్‌. ఆడిష‌న్ స్క్రీన్ ప్లే: మ‌హేష్ ఉప్పాల‌.  సంగీతం: అనుదీప్ దేవ్‌.  రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ అందించారు.  యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌:  విజ‌య్‌, ఎడిట‌ర్‌: అన్వ‌ర్ అలీ.  ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  రామాంజ‌నేయులు.  పుల్ల విష్ణు వ‌ర్ధ‌న్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: సంధ్య సబ్బ‌వ‌ర‌పు వ్యవహరిస్తున్నారు.  పి.ఆర్.ఒ:  ఎస్‌.కె.నాయుడు-ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా) నిర్వహిస్తున్నారు.  ఈవెంట్ పార్ట్‌న‌ర్‌:  యు వుయ్ మీడియా , మార్కెటింగ్‌:  టికెట్ ఫ్యాక్ట‌రీ. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News