)
Tortoise Movie Start: రాజ్ తరుణ్ మళ్లీ దూకుడు పెంచాడు. తాజాగా ‘టార్టాయిస్’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, చందమామ క్రియేషన్స్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్ హీరోగా అమృత చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు "టార్టాయిస్" అనే టైటిల్ పెట్టడంతో పాటు మోషన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం ఈ సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్ అయింది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘టార్టాయిస్’ మూవీ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించేలా ఉండబోతున్నట్టు చెప్పారు. చాలా డిఫరెంట్ స్టోరీ. దర్శకుడు రిత్విక్ కుమార్ స్టోరీ చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. ఇంత మంచి స్టోరీ వస్తున్నా మా నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబులకు అభినందనలు. ఈ చిత్రం నా కెరీర్ కి మంచి కిక్ ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ .. మా మూవీ పూజా కార్యక్రమాలకు విచ్చేసిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. "టార్టాయిస్" చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. రాజ్ తరుణ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందన్నారు. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉండబోతున్నాయని చెప్పారు. కొత్త స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ కథ తో మంచి థ్రిల్లర్ చిత్రం అన్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు. ఈ రోజు మా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసామన్నారు. . నన్ను నమ్మి నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన నా నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు అందిరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు మాట్లాడుతూ .. "మా "టార్టాయిస్" చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే ఆషాభావం వ్యక్తం చేశారు. మాకు స్టోరీ నచ్చింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాము. మా దర్శకుడు రిత్విక్ కుమార్ పై మాకు పూర్తి నమ్మకంతో పాటు విశ్వాసం ఉంది. రాజ్ తరుణ్ తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.