Chiranjeeva Review: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!

Chiranjeeva Review: రాజ్ తరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చిరంజీవ’. ఈ నెల 7 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరి ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..   

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 6, 2025, 06:54 PM IST
Chiranjeeva Review: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!

రాజ్ తరుణ్, కుషిత కల్లపు హీరో, హీరోయిన్లుగా జబర్ధస్త్ ఫేమ్ అదిరే అభి తొలిసారి మెగాఫోన్ పట్టుకొని డైరెక్ట్ చేసిన చిత్రం ‘చిరంజీవ’. సినిమా కథపై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఈ చిత్రాన్ని ముందుగా మీడియాకు వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందనే విషయానికొస్తే..  

Add Zee News as a Preferred Source

కథ విషయానికొస్తే.. 

శివ (రాజ్ తరుణ్) అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అతను పుట్టినపుడే మహార్జాతకుడు అవుతాడని పండితులు చెబుతారు. అయితే దేవుడిపై అతనికి నమ్మకం ఉండదు. ఈ క్రమంలో అతను ఓ దున్నపోతును గుద్దేయడంలో హాస్పిటల్ లో జాయిన్ అవుతాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అతనికి తెలియకుండానే కొన్ని అద్భుత శక్తులు వస్తాయి. దాంతో అతనికి ఎదుటి వారు ఎన్నేళ్లు బతుకుతారనే విషయం తెలుస్తుంది. ఆ పవర్ తో శివ ఏం చేశాడు ? ఈ నేపథ్యంలో రౌడీ సత్తు పహల్వాన్ తో అతనికి మధ్య ఏం జరిగింది ? ఈ క్రమంలో హీరోయిన్ వల్ల అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. అద్భుతమూన  పవర్స్ వల్ల శివ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటనేదే మిగిలిన కథ. 

కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. 

‘చిరంజీవ’ అనే టైటిల్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని దర్శకుడు జబర్ధస్త్ అభి ఈ సినిమాలో చెప్పాడు. మనకు తుమ్ము వచ్చినా.. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా.. పెద్దవాళ్లు చిరంజీవ.. చిరంజీవ అంటూ దీవిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. మనిషికి తాను ఎపుడు చనిపోతాననే విషయం తెలియడం కన్నా.. మరొకటి ఉంటుందు. ఈ కాన్సెప్ట్ తోనే దర్శకుడు అభి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హీరో దున్నపోతును గుద్దుతాడు. దున్నపోతు యమ ధర్మరాజు వాహనం..తన వాహనం యముడి వాహనాన్ని ఢీ కొట్టడంతో హీరోకుఅతీంద్రియ శక్తులు వస్తాయి. ఎదుటి వారి ఆయుష్షు ఎంత కాలం ఉంటుందనే విషయం తెలియడం వంటి కాన్సెప్ట్ అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. 

ఎదుటి వారు ఎంత కాలం బతుకుతారనే విషయం తెలుసుకున్న శివ..దాని వల్ల ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసాడనేది కాస్త ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాడు. అవన్నీ సినిమాలో వర్కౌట్ అయ్యాయి. సినిమా ఆద్యంతం బాగానే లాక్కొచ్చాడు. క్లైమాక్స్ ను ఎలా ముగించాలో తెలియక హడావుడిగా ముగించడం కాస్త నిరాశ పరిచే అంశం. కానీ ఓవరాల్ గా ఈ చిత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్స్.. సరదాగా సాగిపోవడం.. సెకండాఫ్ లో కాస్త ఎమోషన్.. యాక్షన్, సీరియస్ తో సాగుతుంది.అచ్చు రాజమణి  సంగీతం మెప్పిస్తోంది. ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు అభినయ కృష్ణ రొటిన్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా కొత్తగా చెప్పే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.  

నటీనటుల విషయానికొస్తే.. 
రాజ్ తరుణ్ ..శివ పాత్రలో చక్కటి ఈజ్ తో నటించి మెప్పించాడు. మంచి ఎనర్జీతో సినిమా మొత్తాన్ని లాక్కొచ్చాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ పండించాడు. కుషిత కల్లపు నటన బాగుంది. రాజా రవీంద్ర మరోసారి తన పాత్రలో ఒదిగిపోయాడు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు. 

ఓవరాల్ గా ఈ వారం ఓటీటీలో సినిమాలు చూసేవారికి ఆహాలో ప్రసారమయ్యే  ‘చిరంజీవ’ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. 

రేటింగ్.. 2.75/5

Also Read:​  మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Also Read:​  చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News