)
Beauty Movie Pre Release Event: అంకిత్ కొయ్య, నీలఖి జంటగా.. జె.ఎస్.ఎస్.వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించారు. ఆర్.వి.సుబ్రహ్మణ్యం కథ, స్క్రీన్‌ప్లేని అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ఆదివారం మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ.. తమ ప్రతి సినిమా ఆడిందంటే కారణం ఎస్కేన్ అని చెప్పారు. ఈ రోజుల్లో సినిమాకు SKN, శ్రేయాస్ శ్రీనివాస్ చాలా సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు వాళ్లిద్దరు లేకపోతే తాను ఈ రోజు ఇలా ఇక్కడ ఉండేవాడిని కాదన్నారు. ఈ సినిమా చూసిన తరువాత హీరో హీరోయిన్లు ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతారని అన్నారు. వాసుకి, నరేష్ పర్ఫామెన్స్ చూసి డిస్టిబ్యూటర్స్ ఎమోషనల్ అయ్యారని చెప్పారు. అంకిత్ మంచి యాక్టర్ అని మరోసారి రుజువు అవుతుందన్నారు. సినిమాలో దుమ్ముంది కాబట్టే తాము ఇలా ఎక్కువగా మాట్లాతున్నామన్నారు. బ్యూటీ చాలా గొప్ప సినిమా అని.. ప్రతీ తల్లిదండ్రులు చూడాల్సిన మూవీ అని చెప్పారు. సెప్టెంబర్ 19న ప్రతి ఒక్కరు థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.
SKN మాట్లాడుతూ.. బ్యూటీ కథ తనకు చాలా ఇష్టమని.. తన మనస్సుకు హత్తుకుందని చెప్పారు. టైటిల్ మాత్రమే కాదు.. స్టోరీ కూడా ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంటుందన్నారు. పిల్లలు అడిగిందల్లా కొనివ్వలేని తల్లిదండ్రులు పడే మథనం గురించి అద్భుతంగా చూపించారని మెచ్చుకున్నారు. అంకిత్ పర్ఫామెన్స్ చాలా బాగుందని.. నీలఖి ఒరిస్సా అమ్మాయి అయినా మన తెలుగు లెక్కే అని అన్నారు. జీ నుంచి నిమ్మకాయల ప్రసాద్ ఎన్నో గొప్ప తెలుగు సినిమాలను తీసుకువచ్చారని చెప్పారు. బ్యూటీ మూవీ అందరూ చూడాలని అన్నారు.
హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. తనను నమ్మి ఈ ఇంత మంచి సినిమాను తనకు ఇచ్చిన మారుతికి థ్యాంక్స్ అని చెప్పారు. మంచి పాత్రలు.. మంచి సినిమాలు చేసుకుంటూ వెళితే.. ప్రేక్షకులు మనల్ని హీరోని చేస్తారని తనకు అర్థమైందని అన్నారు. ఈ సినిమా ఏ ఒక్కరినీ నిరాశ పర్చదని.. మినిమం గ్యారెంటీ అని చెప్పారు.ఒక్కసారి వచ్చి సినిమా చూడాలని.. నచ్చకపోతే జీరో రేటింగ్ ఇవ్వాలన్నారు. నచ్చితే మాత్రం ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
మూవీ దర్శకుడు జె.ఎస్.ఎస్.వర్దన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ సీటులో కూర్చోబెడుతుందని.. తనకు రెండో ఛాన్స్ ఇచ్చిన మారుతి తనకు డెమీ గాడ్ అని అన్నారు. తనకు నిమ్మకాయల ప్రసాద్ గురువులాంటి వారని చెప్పారు. సుబ్రహ్మణ్యం అందించిన కథ తనకు చాలా నచ్చిందన్నారు. ఓ హీరో ఓ సినిమాను భుజానికి ఎత్తుకుని చేస్తే ఎలా ఉంటుందో.. ఈ మూవీ అలా ఉంటుందన్నారు. ఈ సినిమాకు అంకిత్ చాలా కష్టపడ్డారని చెప్పారు. నటుడు నరేష్ కథకు, డైరెక్టర్‌కు సరెండర్ అవుతారని.. వాసుకి మన అందరి గుండెల్లో ఉండిపోయారని అన్నారు.
నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల మాట్లాడుతూ .. తాను వందల కోట్లు సంపాదించాలని వానరా సెల్యూలాయిడ్‌ను ప్రారంభించలేదని.. మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపారు. బ్యూటీ మూవీ అందరికీ నచ్చుతుందని.. అందరూ అద్భుతంగా నటించారని తెలిపారు. నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ .. బ్యూటీ సినిమా ప్రతీ ఇంట్లో జరిగే కథ అని.. తెరపై అద్భుతంగా మలిచారని చెప్పారు. స్టోరీ చెప్పినప్పుడే ఎంతో ఇన్స్పైర్ అయ్యానని.. సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ మూవీకి రెండు కళ్లు అని అన్నారు. బ్యూటీ మూవీని అందరూ చూడాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook