NTR Vs Rajni: ఎన్టీఆర్ కు రజినీకాంత్ ధమ్కీ.. వార్ డిక్లేర్ చేసిన తలైవా..

NTR Vs Rajni:  మన దగ్గర సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి కి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంటుంది. అంతేకాదు ఆగష్టు 15, జనవరి 26 వంటి జాతీయ పండగలకు కూడా మన హీరోలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీగా ఉంటారు. తాజాగా ఇపుడు రజినీకాంత్ కూడా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల ‘వార్ 2’ వంటి ప్యాన్ ఇండియా సినిమాకు పోటీగా తన లేటెస్ట్ ‘కూలీ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించి బాక్సాఫీస్ వార్ కు తెరలేపారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 5, 2025, 01:26 PM IST
NTR Vs Rajni: ఎన్టీఆర్ కు రజినీకాంత్ ధమ్కీ.. వార్ డిక్లేర్ చేసిన తలైవా..

NTR Vs Rajni: ఇద్దరు బడా స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర క్లాష్ కావడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ యేడాది మోస్ట్ అవేటేడెడ్ ప్యాన్ ఇండియా మూవీస్ లో ‘వార్ 2’ ఒకటి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి ఇద్దరు తెలుగు, హిందీ స్టార్ హీరోలు కలిసి చేస్తోన్న మల్టీస్టారర్ సినిమా కావడంతో ఈ చిత్రంపై  అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాకు స్పై యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అంతేకాదు ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 14న విడుదల చేస్తున్నట్టు ముందుగానే అనౌన్స్ చేశారు.

Add Zee News as a Preferred Source

తాజాగా అదే ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్రల కూలీ మూవీని ఆగష్టు 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.  ఈ సినిమాను తమిళంలో వరుసగా హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ నడుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, శృతి హాసన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్యాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ నెలకొంది.

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

అయితే.. తెలుగు, హిందీలో మటుకు వార్ 2 మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి వేరే భాషలకు చెందిన అగ్ర హీరోలిద్దరు యాక్ట్ చేస్తోన్న మల్టీస్టారర్ మూవీ కావడంతో ‘వార్ 2’ పై మంచి బజ్ ఉంది. హిందీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ట్రేడ్ పండితులు అపడే అంచనా వేస్తున్నారు.

ఇక రజినీకాంత్ నటించిన ‘కూలీ’ మూవీకి లోకేష్ కనగరాజ్ వంటి బ్రాండింగ్ ఉంది. ఒకప్పటిలా రజినీకాంత్ మూవీని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ కూలీ మూవీని రజినీ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు రజినీకాంత్ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతుంటే మన హీరోలు కామ్ గా  సైడ్ గా ఇచ్చేవాళ్లు. కానీ ఇపుడు పరిస్థితులు ఛేంజ్ అయ్యాయి. కూలీ మూవీపై తమిళంలో పాటు తెలుగులో మంచి క్రేజే ఉన్నా.. ఎన్టీఆర్ వంటి లోకల్ మాస్  హీరో  ముందు ఈ సినిమాకు ఏ మేరకు తెలుగులో థియేటర్స్ కేటాయిస్తారనేది చూడాలి. అటు తమిళంలో, కన్నడలో రజినీకాంత్ ఫ్యాక్టర్ వల్ల ‘వార్ 2’ కు అనుకున్న థియేటర్స్ దొరక్కపోవచ్చు. మరి ముందు చెప్పినట్టుగానే ఈ హీరోలు అదే డేట్ కు కన్ఫామ్ గా వచ్చేదాకా నమ్మకం అయితే లేదు. కానీ రెండు చిత్రాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.  ఏది ఏమైనా రసవత్తరమైన ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది వెయిట్ అండ్ సీ.

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News