Coolie: తమిళ గడ్డపై రజినీకాంత్ ‘కూలీ’ రికార్డుల మోత.. ఇది కదా సూపర్ స్టార్ రేంజ్..

Coolie Tamil Theatrical Rights: రజినీకాంత్ నటన అనే ఓ  ట్రాన్స్ ఫార్మర్. ఆయన నుంచి ఎలాంటి నటన రాబడితే ఆడియన్స్ పిచ్చెక్కిపోతారో అలాంటి సబ్జెక్ట్ తో వస్తున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. తాజాగా రజినీకాంత్ తెరకెక్కించిన ‘కూలీ’ మూవీ ఈ యేడాది ఆగష్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల రైట్స్ రికార్డు రేట్స్ కు అమ్ముడుపోతున్నాయి. తాజాగా రజినీ సొంత అడ్డ అయిన తమిళంలో ఈ సినిమా రికార్డు రేటుకు అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 26, 2025, 07:40 AM IST
Coolie: తమిళ గడ్డపై రజినీకాంత్ ‘కూలీ’ రికార్డుల మోత.. ఇది కదా సూపర్ స్టార్ రేంజ్..

Coolie Tamil Theatrical Rights: సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. రజినీకాంత్ కు ఏజ్ తగ్గ పాత్రలో చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత రజినీకాంత్ నటించిన చిత్రాలేవి పెద్దగా అలరించలేకపోయాయి. తాజాగా ఇపుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసిన ‘కూలీ’ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు రూ. 80 కోట్ల భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కూలీ తెలుగు హక్కులను ఏషియన్ సునీల్, సురేశ్ బాబు, దిల్ రాజు సంయుక్తంగా రూ. 40 కోట్లకు అమ్ముడు పోయినట్టు వార్తలు వస్తున్నాయి. 

Add Zee News as a Preferred Source

ఇక రజినీకాంత్ సొంత గడ్డ అయిన తమిళనాడులో ‘కూలీ’ మూవీకి ఓ రేంజ్ రేటు దక్కించుకుంది. ఈ సినిమా తమిళంలో దాదాపు రూ. 110 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిందనేది టాక్. మొత్తంగా తెలుగు, ఓవర్సీస్, తమిళం కలిపితేనే దాదాపు రూ. 230 కోట్ల రికార్డు రేటు బిజినెస్ సొంతం చేసుకుంది. ఇక కన్నడ, మలయాళం, హిందీ కలిపితే..దాదాపు రూ. 300 కోట్లు దాటే అవకాశాలున్నాయి. మొత్తంగా ‘కూలీ’ సినిమాకు తెలుగు, హిందీలో ‘వార్ 2’ వంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ పోటీగా రంగంలో ఉన్నా.. రజినీకాంత్ కూలీ పై అంచనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. 

ఇక రజినీకాంత్ ‘కూలీ’ మూవీకి హిందీలో మాత్రం ‘మజ్దూర్’ టైటిల్ తో రాబోతుంది. ఈ సినిమాపై అది ఇంపాక్ట్ చూపించే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో  నాగార్జున .. సైమన్ అనే విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ ముఖ్యపాత్రల్లో కనిపించున్నారు. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీతో  పలకరించబోతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ, శివరాజ్ కుమార్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. 

Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !

Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News