Peddi first shot: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఫస్ట్ షాట్ కు ముహూర్తం ఫిక్స్..

Peddi first shot: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సన తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, సినిమా టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన  ఫస్ట్ షాట్ ను శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేస్తున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 5, 2025, 12:40 PM IST
Peddi first shot: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఫస్ట్ షాట్ కు ముహూర్తం ఫిక్స్..

Peddi first shot: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. ఉప్పెన్ తర్వాత   దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. శ్రీరామ నవమి సందర్భంగా పెద్ది ఫస్ట్ షాట్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిపిందే కదా. ప్రస్తుతం ఈ ఫస్ట్ షాట్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఏప్రిల్ 6న ఈ ఫస్ట్ షాట్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ ఫస్ట్ షాట్ ఏప్రిల్ 6న ఉదయం 11:45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Add Zee News as a Preferred Source

ఫస్ట్ షాట్ విడుదల సందర్భంగా  బుచ్చి బాబు సానా, సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ ఆదివారం శ్రీరామ నవమి పర్వ దినం సందర్భంగా  ఫస్ట్ షాట్‌ గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అభిమానులు ఇప్పుడు ఏప్రిల్ 6న ఈ గ్లింప్స్‌ను చూడటం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ ఫస్ట్ షాట్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ కలిపి 5 భాషల్లో రిలీజ్ కానుంది.

‘పెద్ది’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. పెద్ది చిత్రం టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టు  ఫస్ట్ షాట్ పవర్-ప్యాక్డ్ విజువల్ ట్రీట్‌ ఇస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన మొదటి సారి  జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ అద్భుతమైన లీడ్ రోల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో రానున్నాయి. ప్రస్తుతం పెద్ది ఫస్ట్ షాట్ కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఎగ్జెటింగ్ గా  ఎదురు చూస్తున్నారు.

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News