Allu Arjun vs Ram Charan: తన మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సనా.. ఆ తర్వాత చిత్రం ఏకంగా రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్ తో కలిసి పనిచేసే అవకాశాన్ని అందుకున్నారు.. ముఖ్యంగా బుచ్చిబాబు ఎవరో కాదు డైరెక్టర్ సుకుమార్ కి నమ్మకమైన శిష్యుడు.. నిన్నటి రోజున పుష్ప -2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హాజరైనప్పటికీ అక్కడ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి..
ముఖ్యంగా పుష్ప మొదటి భాగం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పుష్ప సినిమా 10 కేజీఎఫ్ సినిమాలతో సమానమంటూ తెలియజేశారు. అయితే ఆ సమయంలో బుచ్చిబాబు మాట్లాడిన మాటలు ఈ సినిమా పైన కొంత ప్రతికూలత చూపించిందనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే పుష్ప-2 సినిమా విషయానికి వచ్చేసరికి ఈసారి తన ప్రసంగాన్ని చాలా తక్కువగానే మాట్లాడి ఆపివేయడం జరిగింది.
కేవలం సుకుమార్ గురించి మాత్రమే మాట్లాడాడు. కానీ సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన అల్లు అర్జున్ గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదట.. ఈ విషయం అటు అభిమానులలో తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అంతేకాకుండా అల్లు ఫాన్స్ ఈ విషయాన్ని రచ్చ చేస్తున్నారు. రామ్ చరణ్ తో సినిమా తీస్తున్నారు కాబట్టే అల్లు అర్జున్ పేర్లు తీసుకురావడానికి ఇష్టపడడం లేదనే విధంగా ఆయన పైన ఫైర్ అవుతున్నారు.
అయితే స్టేజ్ మీద చాలామంది మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు మర్చిపోతూ ఉంటారని మెగా అభిమానులు కూడా బుచ్చిబాబుకు సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు.. మొత్తానికి బుచ్చిబాబు అల్లు అర్జున్ పేరు ప్రస్తావించడం మరిచిపోవడంతో మరొకసారి మెగా, అల్లు ఫాన్స్ మధ్య వార్ కొనసాగేలా చేశారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ విషయం పైన అటు బుచ్చిబాబు ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది.
మరొకవైపు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది.
Also Read: YS Sharmila: సముద్రంలో పవన్ కల్యాణ్ హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చాలి
Also Read: Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్..! .. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









