Game Changer Hindi OTT Streamig: జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ‘గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్..

Game Changer Hindi OTT Streamig: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా  శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. థియేట్రికల్ గా పెద్దగా మెప్పించలేకపోయినా ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు సహా మిగిలిన దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 7, 2025, 02:21 PM IST
Game Changer Hindi OTT Streamig: జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ‘గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్..

Game Changer Ott Streaming Date: 2025 పొంగల్ పోటీలో రిలీజైన  రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో   రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఎఎస్ ఆఫీసర్ అయిన రామ్ నందన్ పాత్రతోపాటు ఆయన తండ్రి అయిన రాజకీయ నాయకుడైన అప్పన్నగా తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో నటించి మెప్పించారు. కానీ ఎపుడో 90 వ దశకంలో  రావాల్సిన ఈ చిత్రం స్క్రీన్ ప్లే లోపాల పుట్టతో తెరకెక్కించడంతో ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది. అంతేకాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్.. డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ కావడం ఇంపాజిబుల్. ముందుగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులనే ఎలక్షన్ కమిషన్స్ గా నియమిస్తారు. అందులో స్టేట్ గవర్నమెంట్ ముగ్గురు సభ్యుల పేర్లను కేంద్రానికి పంపిస్తే.. అందులోంచి ఒకరిని సెలెక్ట్ చేస్తారు.

Add Zee News as a Preferred Source

ఈ విషయం కూడా తెలియకుండా శంకర్ ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని ఇష్టమొచ్చినట్టు తెరకెక్కించాడు. మొత్తంగా రామ్ చరణ్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ గా రూ. 100 కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికా స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.             

తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ జీ 5లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను కూడా జీ5 కొనుగోలు చేసింది. త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను అనౌన్స్ చేయనున్నారు. మొత్తంగా థియేట్రకిల్ అంతగా మెప్పించని ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఓటీటీ వేదికగా  ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News